Education Sector : ఇటువంటి విద్య ప్ర‌భుత్వ రంగంలో మాత్ర‌మే ఉండాలి!

కాశీబుగ్గ: సమాజంలో వివిధ రకాల రుగ్మతల్ని తగ్గించి సామాజిక అంతరాలు రూపుమాపి సమానత్వం ఆలోచనను పెంపొందించే లక్షణం విద్యకు మాత్రమే ఉందని, ఇలాంటి విద్య ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉండాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కోరారు. శ్రీకాకుళం జిల్లా యూటీఎఫ్‌ జిల్లా మహాసభలు మందస మండలం హరిపురం ఉన్నత పాఠశాలలో సోమవారం ముగిశాయి. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువలు బలహీనంగా ఉండటానికి కారణం విద్య సగభాగం ప్రైవేటీకరణ కావడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

Intermediate Students : విద్యార్థులు ఉత్త‌మ ఫ‌లితాలు సాధించేలా బోధ‌న‌

విద్యతో సమాజానికి మానవత్వం కలిగిన నూతన తరం తయారుకావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల సంక్షేమం విద్యారంగ వికాసం లక్ష్యాలుగా యూటీఎఫ్‌ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌.మురళీమోహన్‌, కిశోర్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌మూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, ఆఫీస్‌ బేరర్స్‌ వైకుంఠరావు, దాలయ్య, ధనలక్ష్మి, రవికుమార్‌, రమేష్‌, కోదండరావు తదితరులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags