Scholarship Applications : పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు.. చివరి తేదీ!
రాయచోటి: 2024–25 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం అర్హులైన విద్యార్థులు నూతన, రెన్యూవల్ రిజిస్ట్రేషన్ కోసం జ్ఞానభూమి లాగిన్‌లో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని అన్నమయ్య జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి ఎన్.జయప్రకాష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని కళాశాల యాజమాన్యం వారి కళాశాలలోని విద్యార్థుల నూతన, రెన్యువల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 30లోగా పూర్తి చేయాలన్నారు. దరఖాస్తు విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత కళాశాలలో లేదా స్థానిక సచివాలయంలో లేదా జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన తెలియజేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags