Student Achieves IIT Madras Seat : మద్రాస్ ఐఐటీలో సీటు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని..
శంషాబాద్‌లోని పాలామకుల మోడల్ స్కూల్‌లో చదువుకున్న ఓ విద్యార్థిని ప్రస్తుతం, మద్రాస్‌లో ఉన్న ఐఐటీ కళాశాలలో సీటు సాధించింది. ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం అయినప్పటికి ఉన్నత స్థానానికి చేరేందుకు చేసిన తన కృషి ఫలించింది.
Diploma Students: డిప్లొమా విద్యార్థులకు 10వేల ఇంజనీరింగ్ సీట్లు.. పూర్తయిన కౌన్సెలింగ్
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని కొత్తూరుకు చెందిన సుశాంతా కుమార్, మమతా గురు దంపతుల కుమార్తె అయిన కిరణ్ గురు ఈ యువతి. అయితే, తన ఇంటర్‌లో ఎంపీసీలో చేరి ఉత్తమ మార్కులకు కష్టపడి, పట్టుదలతో గొప్ప స్కోరు సాధించింది. పాలామకుల మోడల్ స్కూల్‌లో ఇంటర్ వరకు చదివి 1000 మార్కులకు గాను 981 మార్కులు సాధించి అందరి అభినందనలు పొందింది.
Union Budget 2024: ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య తేడా ఏమిటంటే..
ఇలా, ఇంటర్ తరువాత ఆన్‌లైన్‌లో ఐఐటీ కళాశాలలో చేరేందుకు శిక్షణ పొందింది. చివరికి, పరీక్షలో 77 శాతం ఫలితం దక్కగా మద్రాస్‌లోని ఐఐటీ కళాశాలలో సీటు సాధించింది. ఇలా, తను అనుకున్న బీఎస్ డేటా సైన్స్‌లోకి అడుగు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ప్రిన్సిపాల్, పలువురు అధ్యాపకులు కిరణ్ గురుని అభినందించారు.