Free Coaching for Group 2 Exam: గ్రూప్‌-2 మెయిన్స్ కోసం ఉచిత శిక్ష‌ణ త‌ర‌గ‌తులు..!

గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన వారికి అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ ఇస్తామన్నారు. ఈ నెల 25 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి..

కాకినాడ: ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు ఈ నెల 25 నుంచి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా బీసీ సంక్షేమ, సాధికారత అధికారి ఎం.లల్లీ శనివారం విలేకర్లకు ఈ విషయం తెలిపారు. గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన వారికి అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ ఇస్తామన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అభ్యర్థులకు రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల వెనుకన జయకృష్ణాపురం గణేష్‌ నగర్లో ఉన్న వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రంలో ఈ శిక్షణ ఇస్తారని వివరించారు.

Inter Advanced Supplementary: ఈనెల 24 నుంచి ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు..

శిక్షణతో పాటు ప్రతి సబ్జెక్టుకు ప్రాక్టీసు టెస్టులు, గ్రాండ్‌ టెస్టులు నిర్వహిస్తారన్నారు. లైబ్రరీ, స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. ఎంపికైన వారికి స్టైపెండ్‌, బుక్స్‌ అలవెన్స్‌ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు ‘డైరెక్టర్‌, ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌, ఆర్ట్స్‌ కాలేజీ వద్ద, రాజమహేంద్రవరం’ చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌లో 77 మంది అభ్యర్థులు శిక్షణ తీసుకోగా 26 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. వివరాలకు 0884–2421129, 939393 4825, 8639 44 7339 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చని లల్లీ సూచించారు.

Government Schools and Colleges: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లవైపు మొగ్గు చూపుతున్న‌ విద్యార్థులు..!

#Tags