Anganwadi Centers : అంగ‌న్వాడీ కేంద్రాల్లో చిన్నారుల చ‌దువుపై నిర్ల‌క్ష్యం.. కారణం!

అంగన్‌వాడీ కేంద్రాలపై కూటమి సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

శ్రీస‌త్య సాయి: అంగన్‌వాడీ కేంద్రాలపై కూటమి సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య (ప్రీస్కూల్‌) అందించేందుకు అవసరమైన పుస్తకాలను ఇప్పటికీ పంపిణీ చేయలేదు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించేందుకు ఆసక్తి చూపడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీల బలోపేతం, చిన్నారులకు పౌష్టికాహారం సకాలంలో అందించేందుకు అనేక చర్యలు చేపట్టింది. అందులో ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆటపాటలతో కూడిన బొమ్మల పుస్తకాలు అందజేసింది. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో పేద కుటుంబాల వారు తమ పిల్లలకే అంగన్‌వాడీల్లోనే కాన్వెంట్‌ తరహా బోధన దొరుకుతుందని ముందుకొచ్చారు.

Railway Jobs: రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక

పాత పుస్తకాలతో నెట్టుకొస్తున్నారు!

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల సామ‌ర్థ్యాల‌ను గుర్తించి వాటికి అనుగుణంగా గత ప్రభుత్వం పీపీ–1, పీపీ–2 కిట్లను రూపొందించి విద్యా విధానాన్ని అమలుచేసింది. మూడు నుంచి నాలుగేళ్లలోపు చిన్నారులకు ఇంగ్లిష్‌, గణితం, స్పోకన్‌ ఇంగ్లిష్‌, యాక్టివిటీ డ్రాయింగ్‌కు సంబంధించి ఐదు పుస్తకాలతో కూడిన పీపీ–1 కిట్లను అందజేసింది. 4–5 ఏళ్ల లోపు చిన్నారులకు ఐదు పుస్తకాలతో కూడిన పీపీ–2 కిట్లను అందజేసేవారు. నేడు పుస్తకాల పంపిణీపై కూటమి సర్కారు ఊసే ఎత్తడం లేదు. చేసేది లేక అంగన్‌వాడీ వర్కర్లు అరకొరగా ఉన్న పాత పుస్తకాలతోనే చదువులు చెబుతున్నారు.

NSS Volunteers: ట్రాఫిక్‌ విధుల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు.. వలంటీర్ల మోహరింపు ఇలా...

పుస్తకాలు రాగానే అందజేస్తాం

ఈ ఏడాది అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరిన విద్యార్థులకు సంబంధించిన పీపీ–1, పీపీ–2 కిట్లు ఇంకా రాలేదు. ప్రస్తుతానికి పాత పుస్తకాలతోనే బోధన కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం కొత్త పుస్తకాలు పంపిణీ చేసిన వెంటనే అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అందిస్తాం.

– ఎం.నాగమల్లేశ్వరి, పీడీ, ఐసీడీఎస్‌

IBPS Notification 2024 : ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పోస్ట్‌కు ఐబీపీఎస్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

#Tags