NCC Training Camp: ఎన్‌సీసీ క్యాడెట్ల శిక్ష‌ణ శిబిరం ప్రారంభం.. దీనితో విద్యార్థుల‌కు భ‌విష్య‌త్తు!

ఐడీఎస్‌ఎస్‌సీ–2024కు ఎంపికైన క్యాడెట్ల శిక్షణ శిబిరాన్ని గురువారం ఆంధ్రా బెటాలియన్‌ కమాండెంట్‌ కల్నల్‌ వివేక్‌ సావన్‌ గౌడర్‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విద్యార్థుల‌తో మాట్లాడుతూ..

పెద్దాపురం: విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవడం ఎన్‌సీసీతోనే సాధ్యమని కాకినాడ 18వ ఆంధ్రా బెటాలియన్‌ కమాండెంట్‌ కల్నల్‌ వివేక్‌ సావన్‌ గౌడర్‌ అన్నారు. పెద్దాపురం జవహర్‌ నవోదయ విద్యాలయలో ఆంధ్రా, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ ఐడీఎస్‌ఎస్‌సీ–2024కు ఎంపికైన క్యాడెట్ల శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.

10th Class Supplementary Exams2024 :పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సన్నాహాలు

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ఆర్‌.కమలం అధ్యక్షతన జరిగిన సదస్సులో కల్నల్‌ గౌడర్‌ మాట్లాడుతూ, ఎన్‌సీసీతో ప్రతి విద్యార్థికీ మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, నిబద్ధతతో కూడిన శిక్షణ ఎన్‌సీసీతోనే సాధ్యపడుతుందని చెప్పారు. ఈ నెల 24వ తేదీ వరకూ ఈ శిక్షణ ఉంటుందన్నారు. ఈ క్యాంప్‌లో విద్యార్థులకు డ్రిల్‌, ఆయుధ శిక్షణ, మ్యాప్‌ రీడింగ్‌, యోగాతో పాటు ఆర్మీలోని వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు.

AP EAPCET 2024: ఏపీఈఏపీ సెట్ ప్రారంభం.. ప‌రీక్ష కేంద్రాల‌కు హాజ‌రైన‌వారి సంఖ్య ఇలా!

 

వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన సుమారు 520 మంది పురుష, మహిళా క్యాడెట్లతో పాటు ఇంటర్‌ డైరెక్టరేట్‌ షూటింగ్‌ సెలక్షన్‌ క్యాంపులో భాగంగా మరో 51 మంది విద్యార్థులు పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో సుబేదార్‌ హేమంత కుమార్‌, భాస్కర్‌రెడ్డి, కిషోర్‌, తొమ్మిది మంది ఎన్‌సీసీ అధికారులు, 29 మంది ఆర్మీ అధికారులు, 571 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

#Tags