National Scholarships: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోండి.. వీళ్లు అర్హులు

అనంతపురం : నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షకు 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.వరలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మునిసిపల్‌, ఎయిడెడ్‌, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ, కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 3.5 లక్షలలోపు ఉన్న విద్యార్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబరు 8న పరీక్ష ఉంటుందన్నారు.

Engineering Seats: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ సీట్ల దందా.. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే సీటు..

ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రూ. 50 చెల్లించాల్సి ఉంటుందన్నారు.ఆన్‌లైన్‌లో సెప్టెంబరు 6లోగా దరఖాస్తు చేసుకోవాలని, పరీక్ష ఫీజు సెప్టెంబరు 10లోగా ఎస్‌బీఐ కలెక్ట్‌ లింకు ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు. అనంతపురం కమలానగర్‌లోని పాత డీఈఓ కార్యాలయంలో ఉన్న పరీక్షల విభాగంలోనూ సంప్రదించవచ్చన్నారు.

#Tags