Kakatiya University: 6 నుంచి ఎల్‌ఎల్‌బీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల మూడో సెమిస్టర్‌ పరీక్షలు రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) ఈనెల 6 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక శుక్రవారం తెలిపారు. ఈనెల 6, 11, 13, 15, 18 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు.

5వ సెమిస్టర్‌ పరీక్షలు
కేయూ పరిధిలో మూడేళ్ల లాకోర్సు ఐదో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల7 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక తెలిపారు. ఈనెల 7, 12, 14, 16, 19 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

నిట్‌లో ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ షురూ
కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లోని అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియంలో శుక్రవారం మూడు రోజుల ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ‘సస్టేనబుల్‌ పవర్‌ అండ్‌ ఎనర్జీ రీసెర్చ్‌’ అంశంపై కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో గ్రిడ్‌ ఇండియా డైరెక్టర్‌ రాజీవ్‌కుమార్‌, ఢిల్లీ ప్రొఫెసర్‌ భీమ్‌సింగ్‌ పాల్గొన్నారు.

బయోకెమిస్ట్రీ విభాగాధిపతిగా మధుకర్‌
కేయూ క్యాంపస్‌: కేయూ బయోకెమిస్ట్రీ విభాగాధిపతిగా ఆవిభాగం కాంట్రాక్టు అధ్యాపకుడు మధుకర్‌రావును నియమిస్తూ.. కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య మల్లారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నేళ్లుగా జువాలజీ విభాగాధిపతిగా ఉంటున్న ప్రొఫెసరే అదనంగా.. బయోకెమిస్ట్రీ విభాగ బాధ్యతల్ని చూసేవారు. ప్రస్తుతం జువాలజీ విభాగాధిపతిగా ఉన్న షమిత నుంచి వేరు చేసి బయో కెమిస్ట్రీ కాంట్రాక్టు అధ్యాపకుడికి బాధ్యతలు అప్పగిస్తూ రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
 

#Tags