Education Hub : ఎడ్యుకేషన్ హబ్ గా కాటారం.. ప్రత్యేకతలు ఇవే!
కాటారం: జిల్లా కేంద్రానికి సాటిగా కాటారం మండలం ఓ గొప్ప ఎడ్యుకేషన్ హబ్‌గా కొనసాగుతోంది. మండలంలో ఐదు గురుకుల పాఠశాలతో పాటు మాధ్యమిక విద్య, సాంకేతిక విద్యా కళాశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల అప్‌గ్రేడ్ కళాశాల, మోడ ల్ కళాశాల ఉన్నాయి. మండలానికి చెందిన విద్యార్థులే కాకుండా జిల్లాలోని వివిధ మండలాల, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కాటారంలో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో..
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాటారం మండలంలో పలు ఉన్నత, సాంకేతిక విద్యాసంస్థలు ఏర్పాటు చేశారు. అప్పటి ఉన్నత విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో మండలంలో పాలిటెక్నిక్ కళాశాల, పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ), ప్రభుత్వ జూనియర్ కళాశాల, గంగారం మోడల్ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని యువతకు వృత్తి విద్యను అందించడం కోసం రూ.2కోట్ల నిధులతో యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ) ఏర్పాటు జరిగింది. ఇవే కాకుండా కాటారం, గంగారంలో బాలికల వసతి గృహాల ఏర్పాటు సైతం జరిగింది.
PNB Recruitment 2024: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
కోట్లాది రూపాయలతో పక్కా భవనాలు..
గత కొన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కాటారం మండలకేంద్రంలో కొనసాగగా మండలంలోని కొత్తపల్లి సమీపంలో రూ.8 కోట్ల నిధులతో సరికొత్త హంగులతో పక్కా భవన ఏర్పాటు జరగగా ప్రస్తుతం అక్కడే కళాశాల కొనసాగుతోంది. రూ.4కోట్లతో విద్యార్థుల కోసం హాస్టల్ భవనం నిర్మించగా.. కొన్ని రోజుల క్రితం మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. రూ.40లక్షల ఐఏపీ నిధులతో నిర్మించిన భవనంలో ఐటీఐ కళాశాల తరగతులు నిర్వహిస్తున్నారు. భవనం ఆధునీకరణ కోసం మంత్రి శ్రీధర్‌బాబు ప్రభుత్వం మరిన్ని నిధులు మంజూరు చేయించారు. గంగారం మోడల్ పాఠశాల, వసతిగృహం భవనాలు సుమా రు రూ.3 కోట్లు, రూ.1.20 కోట్లతో ప్రభుత్వ జూని యర్ కళాశాల భవనం, సుమారు రూ.55 లక్షలతో కాటారం మండల కేంద్రంలో ఎస్సీ బాలికల వసతి గృహం, రూ.80లక్షలతో గంగారంలో ఎస్సీ బాలి కల వసతి గృహానికి పక్కా భవనాలు నిర్మించారు.
స్వరాష్ట్రంలో మరిన్ని విద్యాసంస్థలు..
ఉమ్మడి రాష్ట్రంలో మండలంలో సాంకేతిక, ఉన్నత విద్యా కళాశాలలు, పాఠశాలల ఏర్పాటు జరగగా స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం మండలానికి మరిన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు మంజూరయ్యాయి. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఉచిత కేజీ టూ పీజీ నిర్బంధ విద్య కార్యక్రమంలో భాగంగా మండలంలో గురుకులాల సంఖ్య పెరిగిపోయింది. మండలంలో ఎస్సీ బాలికల, గిరిజన బాలికల, బీసీ బాలుర గురుకులాలు మంజూరయ్యాయి. మండలకేంద్రంలో సుమారు రూ.4 కోట్లతో ఎస్టీ బాలికల కోసం గురుకుల భవనాన్ని నిర్మించారు. దామెరకుంటలో రూ.1.20కోట్లతో నిర్మించిన భవనంలో సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల కొనసాగుతుంది. మండలకేంద్రానికి మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులం మంజూరయినప్పటికీ సరైన సౌకర్యాలు లేకపోవడంతో పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్‌లో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు.
Department of Education: 25 వేల మంది ఎస్‌జీటీల బదిలీ
గురుకులాలు కళాశాలలుగా అప్‌గ్రేడ్..
మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నప్పటికీ గిరిజన బాలుర, బాలికల పాఠశాలలు సైతం కళాశాలలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. దీంతో వందలాది మంది విద్యార్థులకు ఇంటర్ విద్య అందుబాటులోకి వచ్చింది. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, మోడల్ పాఠశాలలు కూడా ఇంటర్ కళాశాలలుగా మారడంతో విద్యార్థులు ఇంటర్ విద్యకోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి దూరమైంది.
ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య
దామెరకుంట సోషల్ వెల్ఫేర్
బాలికల అప్‌గ్రేడ్ కళాశాల 640
గిరిజన బాలుర సంక్షేమ
గురుకుల అప్‌గ్రేడ్ కళాశాల 640
గిరిజన బాలికల సంక్షేమ
గురుకుల అప్‌గ్రేడ్ కళాశాల 600
కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల 250
గంగారం మోడల్ పాఠశాల, కళాశాల 425
ప్రభుత్వ జూనియర్ కళాశాల 100
మేడిపల్లి గిరిజన
బాలికల ఆశ్రమ పాఠశాల 310
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 360
ప్రభుత్వ ఐటీఐ కళాశాల 65
విద్యకు నిలయం కాటారం
సాంకేతిక, ఉన్నత విద్య కళాశాలలు
విరివిగా గురుకులాలు, కళాశాలలు
అందుబాటులో వృత్తి విద్యాకోర్సులు
వేలాది మంది విద్యార్థులకు బోధన..
మండలంలో సాంకేతిక, ఉన్నత విద్యా కళాశాలలు, గురుకుల విద్యాలయాల ఏర్పాటు జరగడంతో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒకప్పుడు పదోతరగతి పూర్తికాగానే ఉన్నత విద్య కోసం వెళ్లడానికి మారుమూల గ్రామీణ విద్యార్థులకు ఆర్థిక భారం ఉండేది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు మాన్పించేవారు. ఇప్పుడు విద్యార్థులు అర్ధాంతరంగా చదువులు నిలుపుకొనే పరిస్థితి లేకుండా పోయింది. విద్యార్థులు ఎలాంటి ఆర్థికభారం లేకుండా దూరప్రాంతాలకు వెళ్లకుండా ఇష్టమైన విద్య ఫలాలను అందుకొనే వెసులుబాటు ప్రభుత్వాలు కల్పించాయి. పాలిటెక్నిక్ కళాశాలలో ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు, ఐటీఐలో పలు ట్రేడ్‌లలో విద్యార్థులు చదువుతున్నారు. పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలల్లో చదివి, శిక్షణ పొందిన విద్యార్థులు ప్రస్తుతం పలు ఉపాధి, ఉద్యోగ రంగాల్లో రాణిస్తూ కాటారానికి గొప్పపేరు తీసుకొస్తున్నారు.
కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యాబోధన అందిస్తున్నాం. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం ప్రభుత్వ కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకొని పూర్తిస్థాయి సౌకర్యాలు ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివించి ప్రభుత్వ ఆశయానికి సహకరించాలి.
– లక్ష్మణ్, అకడమిక్ మానిటరింగ్ అధికారి
Australia Student Visa: భారీగా పెరిగిన ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు.. భారతీయులపై తీవ్ర ప్రభావం