June 17th Holiday : జూన్ 17, 25న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. స్కూల్స్‌, కాలేజీల‌కు జూన్ 17వ తేదీన(సోమ‌వారం) సెల‌వు ప్ర‌క‌టించింది. అలాగే ఇదే రోజు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కార్యాల‌యాల‌కు కూడా సెల‌వు ఇచ్చింది. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ ప్రభుత్వం సెలవు ఇచ్చింది.

అయితే బక్రీద్ జూన్ 17న జరుపుకుంటారా లేదా జూన్ 18 జరుపుకుంటారా అనేది క్లారిటీ లేదు. దీంతో బక్రీద్ ఎప్పుడు జరుపుకుంటే అప్పుడు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 17న జరుపుకుంటే ఆ రోజు లేదా 18న జరుపుకుంటే ఆ రోజు సెలవు ఇస్తారు. బక్రీద్ ఘనంగా జరుపుకోవడానికి ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. అయితే జూన్ 17వ తేదీన సోమ‌వారం.. అలాగే జూన్ 16వ తేదీన ఆదివారం ఉంది. దీంతో వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూల్స్, కాలేజీలు, ఆఫీసుల‌కు సెలవులు రానున్నాయి.

ఇక జూన్ 25వ తేదీన కూడా..
జూన్ 25వ తేదీన ఈద్-ఎ -గదీర్‌కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్‌లో 12వ నెల అయిన దుల్ హిజ్జా 10వ తేదీన బక్రీద్ జరుపుకుంటారని చెబుతున్నారు.

2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

#Tags