Jobs: సేల్స్, ఐటీలో ఎక్కువ ఉద్యోగాలు

ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగ నియామకాలకు సానుకూల వాతావరణం నెలకొంది.
సేల్స్, ఐటీలో ఎక్కువ ఉద్యోగాలు

కంపెనీలు ఉద్యోగ నియామకాలను చేపట్టే ఉద్దేశ్యంలో మూడు పాయింట్ల పెరుగుదల ఉన్నట్టు ‘టీమ్‌లీజ్‌ ఎంప్లాయింట్‌మెంట్‌ అవుట్‌లుక్‌’ నివేదిక తెలిపింది. విక్రయాల విభాగంలో ఈ సానుకూల ధోరణి ఎక్కువగా ఉందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 10 శాతం మేర వృద్ధి చెందే అవకాశం, సరఫరా సమస్యలు, నిలిచిపోయిన డిమాండ్‌ ఒక్కసారిగా ఊపందుకోవడం ఇవన్నీ నియామకాలకు సానుకూలించే అంశాలుగా ఈ నివేదిక తెలియజేసింది. వివిధ రంగాలకు చెందిన సంస్థల్లో 58 శాతం.. విక్రయాల ఉద్యోగాలను (సేల్స్‌) చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. 21 రంగాలను సమీక్షించగా.. 2021 అక్టోబర్‌–డిసెంబర్‌ కాలంలో సేల్స్‌లోనే ఎక్కువ మందిని తీసుకోనున్నట్టు కంపెనీలు పేర్కొన్నాయి.

చదవండి: 

భారీ సంఖ్యలో ఐబీపీఎస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ప్రారంభం

అసిస్టెంటు ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్

#Tags