ITI Admissions 2024: ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇదే చివరి తేది
శ్రీశైలం: శ్రీశైలం ప్రభుత్వ పాశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో 3వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎ.రవీంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్ల ఫిట్టర్, టర్నర్, డ్రాఫ్ట్‌మెన్ సివిల్, ఏడాది మెకానికల్ డీజిల్, వెల్డర్ కోర్సులలో సీట్లు ఉన్నాయన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులనీ, వెల్డర్ కోర్సుకు పదవ తరగతి ఫెయిల్ అయిన వారు కూడా అర్హులని ప్రిన్సిపాల్ తెలిపారు.
MBBS And BDS Admissions: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో.. యాజమాన్య కోటాకు నోటిఫికేషన్
ఈనెల 26వ తేదీలోగా www.iti.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకుని, 29 జరిగే కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫి కెట్లతో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు 08524–286055, 9703395091, 9441181072, 9908993910 సంప్రదించాలన్నారు.