ITI Admissions: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 2024–25వ విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తిరుచానూరు రోడ్డు, పద్మావతీపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ వీ.శ్రీలక్ష్మి తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5గంటలలోపు ‘ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10 నుంచి జూన్ 10వ తేదీలోపు సమీపంలోని ఏదేనీ ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని కోరారు. వివరాలకు 94928 61369, 93989 62635, 94908 06942 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.
#Tags