International Conference: అంతర్జాతీయ హిందీ సమ్మేళనం
అంతర్జాతీయ హిందీ సమ్మేళనానికి భారత ప్రభుత్వం తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పూర్వ ఆచార్యులకు ఆహ్వానం అందింది.
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం పూర్వ ఆచార్యులు, విశాఖ హిందీ పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎం.ఎస్ ఇక్బాల్‌కి కజకిస్తాన్‌లో జరిగే అంతర్జాతీయ హిందీ సమ్మేళనానికి భారత ప్రభుత్వం తరఫున ఆహ్వానం అందింది. కజికిస్తాన్‌లోని ఫరాబి కజఖ్ జాతీయ విశ్వవిద్యాలయం, వివేకానంద సాంస్కృతిక కేంద్రం, భారత ఎంబసీ సంయుక్తంగా యూరేషియా, భారత్‌లో హిందీ వర్తమానం, భవిష్యత్తు అంశంపై సదస్సును నిర్వహిస్తోంది.
CRT to Regular: రెగ్యులర్ టీచర్లుగా నియామకం
మార్చి 13–14 తేదీలలో హిందీ భాష, సాహిత్యాలపై ఆల్మటీ యూనివర్సిటీలో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో విభిన్న దేశాలకు చెందిన హిందీ భాష నిపుణులు హాజరుకానున్నారు. ఈ సందర్భగా ఆచార్య ఇక్బాల్ హిందీ భాష వికాసంలో చారిత్రాత్మక సంఘటనలు అనే అంశంపై తమ ప్రసంగ పత్రాన్సి సమర్పిస్తారు.
#Tags