Facilities in School : పాఠశాలలో నిర్మాణంలో ఉన్న తరగతి గదుల పరిశీలన!
హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం రేమల్లేలోని జెడ్పీ హైస్కూల్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమగ్ర శిక్ష జిల్లా అధికారి రాములు నాయక్ గురువారం తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని రాములు నాయక్ ఆదేశించారు. ఎంఈవో–2 బి.సురేష్‌కుమార్, పంచాయతీ రాజ్ ఏఈ డి. జయరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్.లూథర్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
Gurukul Inspection : గురుకులానికి సందర్శించిన సెక్రెటరీ.. విద్యార్థులకు పలు సూచనలు!
#Tags