School Inspection : పాఠ‌శాల‌లో ఆక‌స్మిక‌ త‌న‌ఖీ.. విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాలి..

గూడెంకొత్తవీధి: గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు సూచించారు. శుక్రవారం మండలంలోని జర్రెల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులకు కొద్దిసేపు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారులు వినాయకరావు, తిరుపతిరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Union Cabinet: రెండు విమానాశ్రయాలు, మూడు మెట్రో రైలు ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌

బడిఈడు పిల్లలెవరూ బయట ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ మేడూరు పాఠశాలను సందర్శించారు. అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. దీన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

BRAOU Degree and PG Courses Admissions 2024-25 : ఈ ఏడాది ఏపీ విద్యార్థుల‌కు నిరాశే..దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాల్లేవ్‌.. ఎందుకంటే..?

#Tags