IIT Madras: డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో కోర్సులు.. అడ్మీషన్‌కి చివరి తేదీ ఇదే

ఐఐటీ మద్రాస్‌.. డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇంటర్‌ లేదా 12వ తరగతి పాసైన విద్యార్థులు అర్హులు. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే 500కు పైగా పాఠశాలలు ఈ సర్టిఫికేషన్‌ కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. 

AP TET 2024 Exams: అక్టోబర్‌ 3 నుంచి టెట్‌ పరీక్షలు.. ఆ అభ్యర్థులకు 50 నిమిషాలు అదనంగా..

ఇందులో భాగంగా మొదటి బ్యాచ్‌లో 11 వేల మంది విద్యార్థులు జాయిన్‌ అయ్యారు. తర్వాతి బ్యాచ్‌ కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలయ్యింది. వీరికి అక్టోబర్‌ 21 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయి.  ఈ క్రమంలో విద్యార్థులు అక్టోబర్‌ 4లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Job Mela: పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌మేళా.. జీతం రూ. 30వేలు

సుమారు నాలుగు నుంచి ఎనిమిది వారాల పాటు ఈ ట్రైనింగ్‌ సెషన్‌ ఉంటుంది. ఈ కోర్సులో వీడియో లెక్చర్స్, అసైన్‌మెంట్స్, ప్రొఫెసర్స్, కోర్స్ ఇన్‌స్ట్రక్టర్స్‌తో లైవ్‌ ఇంటరాక్షన్స్‌తో ఉంటాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు onlinedegree.iitm.ac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags