ICDS Posts Interview: వివిధ పోస్టుల భ‌ర్తీకి ఐసీడీఎస్‌లో ఇంట‌ర్య్వూలు

స్త్రీ శిశు సంక్షేమ కార్యాల‌యంలో వివిధ పోస్టుల భ‌ర్తీ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌గా అవ‌కాశాన్ని వినియోగించేందుకు వ‌చ్చిన వారినికి ఇంట‌ర్య్వూ జ‌రిపినట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికార‌త అధికారి తెలిపారు.

సాక్షి ఎడ్యుకేష‌న్: జిల్లా ఐసీడీఎస్‌ కార్యాలయంలో 9 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ఉదయం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారత అధికారి విజయకుమారి, ఇతర అధికారులు ఉదయం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు.

Inter University Competitions: న‌న్న‌య యూనివ‌ర్సిటీలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు..

రాజమహేంద్రవరం కేంద్రంగా జిల్లా కో–ఆర్డినేటర్‌, రెండు ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, సోషల్‌ వర్కర్‌, అకౌంటెంట్‌ పోస్టు, డేటా అనలిస్ట్‌, అసిస్టెంట్‌ కండేటా ఎంట్రీ ఆపరేటర్‌, రెండు ఔట్‌ రీచ్‌ వర్కర్స్‌, స్పెషలైజ్డ్‌ అడాప్షన్‌ ఏజెన్సీ కేటగిరీలో మేనేజర్‌, సోషల్‌ వర్కర్‌, నర్సు (మహిళ), డాక్టర్‌ (పార్ట్‌ టైం), ఐదు ఆయా, చౌకిదార్‌ (పురుష/మహిళ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ ప్రక్రియలో భాగంగా తొలిరోజు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తొమ్మిది పోస్టులకు 154 మంది దరఖాస్తు చేసుకోగా 131మంది హాజరయ్యారని జిల్లాకలెక్టర్‌ వివరించారు. డీఎల్‌డీవో వీణాదేవి, జిల్లా సోషల్‌ సంక్షేమ అధికారి సందీప్‌, ఇతర అధికారులు ఇంటర్వ్యూలను నిర్వహించారు.
 

#Tags