10 Days Holidays : సెలవులే సెలవులు.. విద్యార్థులకు వరుసగా పది రోజులు హాలిడేస్.. ఈ ఒక్కరోజు మాత్రం..!
సాక్షి ఎడ్యుకేషన్: ఇప్పటికే వరుస వర్షాల కారణంగా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం, పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పటికీ.. విద్యార్థులకు మరోసారి సెలవులు రానున్నాయి. అంటే, ఆగస్ట్ నెల ప్రారంభం కావడంతో పండుగలు కూడా ప్రారంభమయ్యాయి కదా.. అయితే, ఈ నెలలో పండుల సెలవులతోపాటు రెండో శనివారం, ఆదివారాలు ఉండడంతో సెలవులు వరుసగా మారాయి. ఈ రకంగా రోజూ స్కూల్‌కి వెళ్లి అలసటతో తిరిగి వచ్చే విద్యార్థులకు ఇది పెద్ద వార్తే.. ఒక్క రోజు సెలవు కోసం వేచి చూసే వారికి ఇలా వరుసగా సెలవులు రావడం నిజంగా వారికి ఇది శుభవార్తే.. శనివారం, ఆదివారంతోపాటు రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం, స్వాతంత్య్ర దినోత్సవం వంటి సెలవులు రావడంతో వరుస పెరిగింది.
ప్రభుత్వానికి విజ్ఞప్తి..
రెండో శనివారం, ఆదివారాలు విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రకటించిన పండుగలకు కూడా ప్రతీ ఏటా సెలవులు ఉంటాయి. కాని, ఆగస్టు 9వ తేదీన జరిపే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసి రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించాయి ప్రభుత్వాలు. అయితే, ఆ రోజున ఆదివాసీలకు సంబంధించిన సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు చర్చించుకోవడానికి వారు అవకాశం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఈ తేదీకి సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా అయితే, పాఠశాల, కళాశాల విద్యార్థులకు వరుసగా పది రోజులు సెలవుల పండగే. ఇప్పటికే విద్యార్థులు సెలవులు.. సెలవులు అంటూ ఆనందపడుతున్నారు. ఇకపోతే, ఈ వివరాలను పాఠశాల, కళాశాల బృందం ప్రకటిస్తే ఉత్తమం.
School Holidays : విద్యార్థులకు సెలవులవార్త.. వరుసగా ఐదు రోజులు.. కాని!