Guest Faculty Recruitment: గెస్ట్‌ లెక్చరర్లకు ఆహ్వానం.. దరఖాస్తులు ఎప్పటివరకంటే..

వరంగల్‌ : దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్ల నియామకానికి విద్యాశాఖ కమిషనర్‌ అనుమతి ఇచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, తెలుగు, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బాటనీ విభాగాల్లో ఒక్కో పోస్టు, కామర్స్‌లో రెండు పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు.

SSC MTS Notification 2024: పదో తరగతి పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 8326 పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

పీజీలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీ 50శాతం మార్కులు కలిగి ఉండాలని, నెట్‌, స్లెట్‌, సెట్‌, పీహెచ్‌డీ అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 1వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

#Tags