KSN Women's Degree College : కేఎస్‌ఎన్‌ కళాశాల విద్యార్థినుల‌కు పూర్తి భ‌ద్ర‌త.. ఈ విద్యాసంవ‌త్స‌రంలో అందుబాటులోకి కొత్త కోర్సులు..

కేఎస్‌ఎన్‌ (కాశెట్టి సుభద్రమ్మ నారాయణప్ప) ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల.. అనంతపురంలోని భైరవనగర్‌ ఆర్టీఏ కార్యాలయం వెనుక.. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి పక్కనే ఉన్న ఈ కళాశాలకు ఘనమైన చరిత్రే ఉంది.

అనంతపురం: 1984లో కేవలం రెండు కోర్సుల (బీఏ, బీకాం)తో అనంతపురంలోని మొదటి రోడ్డు శారద మున్సిపల్‌ బాలికల ఉన్నత పాఠశాల భవనాల్లో ప్రారంభమైన కేఎస్‌ఎన్‌ నేడు 18 కోర్సులతో రాయలసీమలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

కార్పొరేట్‌కు మించి నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థినులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తుండడంతో ఈ కళాశాలలో చేరేందుకు విద్యార్థినులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో 2024–25 విద్యాసంవత్సరంలో ఆరు కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆయా కోర్సుల్లో ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

Degree Results: ఓయూ డిగ్రీ ఫలితాల్లో అమ్మాయిల హవా

శారద మున్సిపల్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన కేఎస్‌ఎన్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను అనంతరం సప్తగిరి సర్కిల్‌లోని కేఎస్‌ఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాల పక్కకు మార్చారు. ఈ క్రమంలోనే 2007లో ‘నాక్‌’ అక్రిడిటేషన్‌కు దరఖాస్తు చేసుకోగా ‘సీ ప్లస్‌ప్లస్‌’ గ్రేడ్‌ వచ్చింది. అనంతరం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పక్కనే నాలుగు ఎకరాల్లో నిర్మించిన పక్కా భవనాల్లోకి 2011లో కళాశాలను మార్చారు.

New Guidelines for Teachers : టీచర్ల అభిప్రాయాల‌తో కొత్త మార్గదర్శకాలు ఇచ్చామన్న సర్కారు.. నేటి నుంచి 14వ తేదీలోగా..

హాస్టల్‌ వసతి కూడా ఉండడంతో ఈ కళాశాలలో ప్రవేశాలు పొందేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి విద్యార్థినులు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. 1,700 మంది విద్యార్థినులు ఉన్నారు. 50 మంది అధ్యాపకులు విద్యాబోధన చేస్తున్నారు. కళాశాల ఆవరణతో పాటు తరగతి గదుల్లోనూ సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటోంది. డిజిటల్‌ లైబ్రరీ ద్వారా మూడు వేలకు పైగా పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు.

కేఎస్‌ఎన్‌ మహిళా డిగ్రీ కళాశాలకు 2014లో నాక్‌ ‘బీ’ గ్రేడ్‌ దక్కింది. ఆ తర్వాత 2022, ఏప్రిల్‌లో ‘ఏ’ గ్రేడ్‌ దక్కించుకుంది. ఎస్కే యూనివర్సిటీ పరిధిలో తొలిసారి నాక్‌ ‘ఏ’ గ్రేడ్‌ పొందిన ఏకైక కళాశాలగా అప్పట్లో ఖ్యాతిగాంచింది. ఇందుకు గాను అదే ఏడాది ఉన్నత విద్యాశాఖ నుంచి ‘రసస్వద–ది అప్రిసియేషన్‌ 2022’ అవార్డును అందుకుంది. అదే విద్యా సంవత్సరం జూన్‌లో పదేళ్ల పాటు ‘స్వయం ప్రతిపత్తి (అటానమస్‌)’ హోదా సాధించింది. 2023–24 విద్యా సంవత్సరంలో అడ్మిషన్‌ ప్రక్రియలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం పొందింది. పర్యావరణ పరిరక్షణ, నాణ్యమైన విద్యా బోధనకుగాను ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ పొందిన రాష్ట్రంలోనే మొదటి కళాశాలగా గుర్తింపు దక్కించుకుంది. గత రెండేళ్లుగా 300కు పైగా క్యాంపస్‌ డ్రైవ్‌లు చేపట్టి అర్హులైన వారు ఉద్యోగాలకు ఎంపికయ్యేలా చర్యలు తీసుకున్నారు.

IBPS PO/MT Notification : ఐబీపీఎస్‌ పీఓ/ఎంటీ నోటిఫికేషన్‌ విడుదల.. ఆరు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 4,455 పోస్ట్‌లు

కేఎస్‌ఎన్‌ మహిళా డిగ్రీ కళాశాలకు రాష్ట్రస్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు రెండు కోర్సులతో ప్రారంభమై...18 కోర్సులు అందిపుచ్చుకుని...సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థినులకు పూర్తి భద్రత క‌ల్పించింది. ఈ ఏడాది నుంచి అందుబాటులోకి ఆరు కొత్త కోర్సులు వ‌చ్చాయి.

Engineering Colleges: మేనేజ్‌మెంట్‌ కోటాలో భారీగా డబ్బులు వసూలు.. హైకోర్టు తీర్పుతో తలకిందులు, డబ్బులు వెనక్కి ఇస్తారా?

కొత్తగా అందుబాటులోకి వచ్చిన కోర్సులు ఇవే

బీకామ్‌ (బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌)

బీఎస్సీ హానర్స్‌ (హోమ్‌ సైన్స్‌)

బీబీఏ హానర్స్‌ (రిటైల్‌ ఆపరేషన్‌)

బీఎస్సీ హానర్స్‌ (మైక్రోబయాలజీ)

బీఎస్సీ హానర్స్‌ (ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌)

బీఎస్సీ హానర్స్‌ (స్టాటిస్టిక్స్‌)

Rakesh Raj Rebba: చిత్రలేఖనంలో డెలివరీ బాయ్‌ వారెవ్వా.. కుంచె పట్టాడంటే అద్భుతాలు

మా కళాశాలలో విద్యార్థినులకు పూర్తి స్థాయి భద్రత కల్పించాం. సీసీ కెమరాల పర్యవేక్షణలో తరగతులు నిర్వహిస్తున్నాం. నాణ్యమైన బోధనతో విద్యార్థినులకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తున్నాం. అందరి సహకారంతో ఇప్పటి వరకూ చాలా విజయాలు సాధించాం. రాష్ట్రంలోనే మా కళాశాలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు రావడం సంతోషదాయకం. అదే స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం.

– డాక్టర్‌ పి.శంకరయ్య ప్రిన్సిపాల్‌, కేఎస్‌ఎన్‌ మహిళా డిగ్రీ కళాశాల

#Tags