Government School Teachers: టీచర్లకు నేటి నుంచి టీచ్‌ టూల్‌ అబ్జర్వేషన్‌పై శిక్షణ

హిందూపురం టౌన్‌: హిందూపురం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లోని పలు మండలాల ఉపాధ్యాయులకు గురువారం నుంచి 27వ తేదీ వరకు టీచ్‌ టూల్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కోర్సు డైరెక్టర్‌, మండల ఎంఈఓ గంగప్ప తెలిపారు. బుధవారం ఎంజీఎం పాఠశాలలో శిక్షణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

Navodaya Admission 2024: నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలు.. చివరి తేదీ ఇదే

పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో తొమ్మిది రోజుల పాటు హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, పరిగి, మడకశిర, రొళ్ల, అగళి, గుడిబండ, అమరాపురం మండలాల సీనియర్‌ ఎస్‌జీటీ టీచర్లు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలకు, స్కూల్‌ అసిస్టెంట్లకు, హెచ్‌ఎంలకు, సీఆర్‌ఎంటీలకు టీచ్‌ టూల్‌ అబ్జర్వేషన్‌పై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
 

#Tags