AI Program at VVIT College : వీవీఐటీ క‌ళాశాల‌లో గూగుల్‌ క్లౌడ్‌ జెన్‌ ఏఐ ప్రోగ్రామ్‌.. విద్యార్థులు ఈ విష‌యాల్లో అవ‌గాహ‌న‌..

పెదకాకాని: దేశంలో తొలిసారిగా వీవీఐటీ కళాశాలలో ఏర్పాటు చేసిన గూగుల్‌ ల్యాబ్‌ నందు ‘గూగుల్‌ క్లౌడ్‌ జెన్‌ ఏఐ ప్రోగ్రామ్‌’ను గూగుల్‌ సంస్థ ప్రతినిధులు గూగుల్‌ క్లౌడ్‌ ప్రోగ్రామ్‌ హెడ్‌ శ్వేతా కొమ్మినేని, గూగుల్‌ టెక్నికల్‌ హెడ్‌ ఆకాష్‌ సిన్హాలు శుక్రవారం ప్రారంభించారు. జెనరేటివ్‌ అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికత నందు విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మక గూగుల్‌ సంస్థ ఏర్పాటు చేసిన గూగుల్‌ క్లౌడ్‌ జెన్‌ ఏఐ ప్రోగ్రామ్‌ను ఎల్‌–4జీ సంస్థ ద్వారా వీవీఐటి విద్యార్థులకు అందించనున్నట్లు కళాశాల చైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ తెలిపారు.

Cm Revanth Reddy Launches New Scheme: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసైన వారికి బంపర్‌ ఆఫర్‌.. ఈ పథకానికి వీళ్లే అర్హులు

గూగుల్‌ క్లౌడ్‌ ప్రోగ్రామ్‌ హెడ్‌ శ్వేతా కొమ్మినేని మాట్లడుతూ జెన్‌ ఏఐ సాంకేతికతలో నిష్ణాతులుగా తీర్చిదిద్దే సాంకేతికతను గూగుల్‌ సంస్థ విద్యార్థులకు అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజులలో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో మానవ ప్రయత్నాన్ని జెన్‌ ఏఐ ఏవిధంగా తగ్గించగలదో విద్యార్థులకు వివరించారు. వివిధ కళాశాలలకు చెందిన 30 మంది ఆధ్యాపకులకు జెన్‌ ఏఐ ప్రోగ్రామ్‌ గురించి వివరించారు. ప్రిన్సిపల్‌ వై.మల్లికార్జునరెడ్డి, గూగుల్‌ ప్రతినిధులు, ఎల్‌ 4జీ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

UPSC Civil Prelims Results 2024: యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల..

#Tags