Goodnews For Students To Clear Backlog Subjects: బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులున్నాయా? అలాంటి వారికి గుడ్‌న్యూస్‌...

తిరుపతి సిటీ: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ద్వారా పలు కోర్సులలో డిగ్రీ చదువుతున్న విదార్థులకు వర్సిటీ శుభవార్త చెప్పింది. 1987 నుంచి 2012వరకు పలు యూజీ కోర్సులలో అడ్మిషన్లు పొంది బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులు పెండింగ్‌లో ఉన్న వారు ఈ ఏడాదిలోపు దరఖాస్తు చేసుకుని ఉత్తీర్ణత సాధించాలని అధికారులు సూచించారు.
Goodnews For Students To Clear Backlog Subjects

ఈమేరక ఇప్పటికే జిల్లాలోని అన్ని అంబేడ్కర్‌ స్టడీ సెంటర్లకు సమాచారం అందించారు. ఈ ఏడాది రెండు సార్లు పెండింగ్‌ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారని, ఆ తర్వాత ఎటువంటి రిలాక్సేషన్‌ ఉండదని తెలియజేశారు.

Sankranti Holidays 2025: స్కూళ్లు బంద్‌.. నేటి నుంచి సంక్రాంతి సెలవులు

మరింత సమాచారం కోసం తాము అడ్మిషన్లు పొందిన స్టడీ సెంటర్లను సంప్రదించాలని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల స్టడీ సెంటర్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ వై.మల్లికార్జునరావు తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags