Good News for Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న బేసిక్ పే.. శుభవార్తను అందించిన కేంద్రం..!
సాక్షి ఎడ్యుకేషన్: కేంద్రం రెండు వేతన సంఘాల మధ్య ఉంటున్న 10 ఏళ్ల గ్యాప్‌ని అలాగే, కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిసింది. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వ 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయనే అంచనాలున్నాయి. అయితే, 7వ వేతన సంఘం 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేసినా, దాని సిఫార్సులను 2016 జనవరి 1 నుంచి అమలు చేశారు.
అందుకే 8వ వేతన సంఘం సిఫార్సును కూడా పదేళ్ల తర్వాత అమలు చేసే అవకాశం ఉంది. అయితే, దీని ద్వారా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల శాలరీలు, రిటైర్మెంట్ బెనెఫిట్లను సవరించనున్నట్లు తెలుస్తోంది. కాని, 5 రాష్ట్రాల్లో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఇప్పుడే అమలు చేయోచ్చని ఉద్యోగులు అభిప్రాయ పడ్డా ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనలు రాలేదు.
అంచనా వేసినా..
1 జనవరి 2021 నుంచి అమల్లో వస్తుందనుకున్న 8వ వేతన సంఘం ఉద్యోగుల ఐదేళ్ల జీతాల ప్లాన్ సవరణపై వేసిన అంచనా అలాగే ఉండిపోయింది. ఇది సిబ్బంది జీతాలలో 7 లక్షల 20వేల నుంచి 7 లక్షల 25 వేలవరకు పెంపుదలని అందిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ప్రయోజనాలు ఇలా..
➨ఇది ఉద్యోగులకే కాదు సైనిక సిబ్బందులకు, పెన్షనర్లకూ వర్తిస్తుంది.
➨వివిధ వర్గాల్లోని ఉద్యోగుల జీతాల మధ్య ఉండే అసమానతను తొలగిస్తుంది.
➨ఉద్యోగులకు మెరుగైన జీవనశైలి అందుతుంది.
➨దీని కింద, ఉద్యోగులకు జీతం దాదాపుగా 20 శాతం పెరుగుతుంది అని అంచనా.
➨ప్రభుత్వ ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది.
➨రిటైర్ అయిన ఉద్యోగులు ద్రవ్యోల్భణాన్ని సులభంగా ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా, ఉద్యోగల పదవీ విరమణలో 30 శాతం పెంపును సూచిస్తోంది.
School Holidays : విద్యార్థులకు సెలవులవార్త.. వరుసగా ఐదు రోజులు.. కాని!
అర్హులు.. అలవెన్స్ ఇలా..
భారత కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న సిబ్బంది, సంబంధిత పెన్షనర్ల సర్కిల్‌ను కలిగి ఉండి, అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు పొందే పదవి విరమణ సిబ్బందులు అర్హులు. అంతేకాకుండా, 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేని 25% నుంచి 35% వరకూ సవరించాలని ప్రతిపాదించే అవకావం ఉంటుంది. అలవెన్స్ కింద ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పే 25 శాతం నుంచి 35 శాతానికి పెంచే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2021 జనవరి నాటికి DA 50% పైన పెరుగుతుందని అంచనా ఉంది. ఈ భత్యాన్ని ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా లెక్కింపు జరుగుతుంది.