Free training in tailoring: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

కొరిటెపాడు(గుంటూరు): యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 14నుంచి సెల్‌ఫోన్‌ రిపేర్‌ అండ్‌ సర్వీసెస్‌, టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ జి.బి.కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

National Scholarship: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారా? డెడ్‌లైన్‌ ఇదే

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు సెల్‌ఫోన్‌ సర్వీసింగ్‌, టైలరింగ్‌ను యువతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని పేర్కొన్నారు.

10వ తరగతి పాస్‌/ ఫెయిల్‌ అయిన 19 నుంచి 45 సంవత్సరాలలోపు అర్హులని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు ఫొటోస్టాట్లతో పాటు నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సంస్థలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

National Scholarship: నేషనల్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారా? డెడ్‌లైన్‌ ఇదే

వివరాలకు యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, ఓల్డ్‌ బ్యాంక్‌ వీధి, కొత్తపేట, గుంటూరు లేదా 0863–2336912, 9700687696, 8125397953, 9949930155 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
 

#Tags