Free computer Training: బేసిక్‌ కంప్యూటర్స్‌లో ఉచిత శిక్షణ.. కావల్సిన అర్హతలు ఇవే

భూదాన్‌పోచంపల్లి : యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలంలోని జలాల్‌పురంలో గల స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఆధ్వర్యంలో 3 నెలల కాలపరిమితి గల బేసిక్‌ కంప్యూటర్స్‌(డేటా ఎంట్రీ ఆపరేటర్‌) కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ పీఎస్‌ఎస్‌ఆర్‌ లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

National Scholarships: నేషనల్‌ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. చదువు మధ్యలో మానేసిన వారు అర్హులు కాదని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్‌ ఫొటోలతో సెప్టెంబర్‌ 9న సంస్థలో నిర్వహించే కౌన్సిలింగ్‌కు నేరుగా హాజరు కావాలన్నారు.

Job Mela: రేపు జాబ్‌మేళా..వీళ్లు అర్హులు

ఎంపికై న అభ్యర్థులకు శిక్షణ కాలంలో ఉచిత భోజనంతో కూడిన హాస్టల్‌ వసతి కల్పిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత తప్పనిసరిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని వివరించారు. 9133908000, 9133908111, 9133908222 నంబర్లను సంప్రందించాలని పేర్కొన్నారు.

#Tags