DSC Free Coaching : డీఎస్సీ ప‌రీక్ష‌కు ఉచిత శిక్ష‌ణ‌.. వీరికే!

 రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్ష రాసే 150 మంది గిరిజన విద్యార్థులకు ఇచ్చే ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు కోరారు.

నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్ష రాసే 150 మంది గిరిజన విద్యార్థులకు ఇచ్చే ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు కోరారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రార్థన గీతం, జ్యోతి ప్రజ్వలన, సేవాలాల్‌ మహారాజ్‌, ఏకలవ్య, వెన్నెల గంటి రాఘవయ్య, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలలమాలలు వేసి నివాళులర్పించారు.

Banking Laws Bill: బ్యాంకింగ్‌ సవరణ బిల్లు.. ఒక అకౌంట్‌కు నలుగురు నామినీలు..!

అనంతరం మాట్లాడుతూ జిల్లా 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 1.44 లక్షల మంది గిరిజనులు ఉన్నారని అన్నారు. జిల్లాలో 11 గిరిజన రెసిడెన్షియల్‌ పాఠశాలలో 2377 మంది విద్యార్థిని, విద్యార్థులు, ఆశ్రమ పాఠశాలలో 1107 మంది, మూడు గిరిజన కాలేజి వసతి వసతి గృహాలలో 239 మంది విద్యను అభ్యసిస్తున్నారన్నారు. జిల్లాలో ఎక్కువగా వెల్దుర్తి, మాచర్ల, మాచవరం, బొల్లాపల్లిలో ఎక్కువగా గిరిజనులు ఉన్నారన్నారు. కొన్ని గిరిజన పాఠశాలలో ప్రహరీలు, మరుగుదొడ్లు లేవని వాటి నిర్మాణానికి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Best Teacher Awards : ఉపాధ్యాయుల పుర‌స్కారాల‌కు ద‌ర‌ఖాస్తులు..

ప్రధానమంత్రి జనమాన్‌ పథకం ద్వారా వసతులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. సుమారు 134 మందికి 160 ఎకరాలు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు అందజేశామని, ఇంకా ఏమైనా పెండింగ్‌ ఉంటే రానున్న రోజులలో వాటిని పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో నెలలో ఒకరోజు గిరిజన, ఎస్సీలకు ప్రత్యేక ఫిర్యాదుల దినం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

Girls Hostels Inspection : బాలిక‌ల వ‌స‌తి గ్రుహాల త‌నిఖీ.. అధికారుల‌కు సూచ‌న‌లు..

విద్యార్థిని విద్యార్థులు నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ చాలా బాగుందని ప్రశంసించారు. అధ్యక్షత వహించిన జిల్లా రెవెన్యూ అధికారి కె.వినాయకం మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్ధం చేసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన వారికి పథకాలు అందేలా చూడాలన్నారు. పిల్లలను బడులకు పంపి ఉన్నత చదువులు చదివేలా తల్లిదండ్రులు చూడాలన్నారు.

Oil India Limited Recruitment: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

జిల్లా గిరిజన సంక్షేమ అధికారి లోతేటి వరలక్ష్మి మాట్లాడుతూ ఆదివాసి దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. పదో తరగతిలో ప్రతిభ కనపరచిన ఈశ్వర నాయక్‌, వెన్నెల బాయి, అభిషేక్‌ నాయక్‌, లావణ్యలను సత్కరించారు. జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ గనోరే, సంఘ నాయకులు కోటా నాయక్‌, శ్రీనునాయక్‌, రాంబాబు నాయక్‌, కృష్ణానాయక్‌, హీరాలాల్‌ నాయక్‌, చిన్నప్ప ప్రసంగించారు.

Degree Supplementary Results : డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాలు విడుద‌ల‌.. ఉత్తీర్ణ‌త ఇలా..

#Tags