Free Coaching for APPSC Group 2 Mains: నేటి నుంచి గ్రూప్-2 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ ప్రారంభం..
ఏలూరు: జూన్ 1 నుంచి బీసీ స్టడీ సర్కిల్ ఏలూరులో గ్రూపు–2 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్‌వీ నాగరాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్‌సీ గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జూలై 28న నిర్వహించే మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.
Basara IIIT Admissions: బాసర ట్రిపుల్‌ఐటీలో దరఖాస్తుల స్వీకరణ.. చివరి తేదీ ఎప్పుడంటే..
నిత్యం ప్రాక్టీస్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఉంటాయన్నారు. లైబ్రరీ సౌకర్యం, స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయని, శిక్షణా కాలంలో స్టైఫండ్, బుక్స్ అలవెన్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తారన్నారు. అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంగ్లిషు మీడియం యూపీ స్కూల్, వెన్నవెల్లివారి పేట, ఏలూరు అడ్రస్‌కు లేదా 99123 94799, 83419 91001 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని నాగరాణి కోరారు.