Polycet Counselling: పాలిసెట్ కౌన్సెలింగ్ నాలుగో రోజు ఇలా..

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో నాలుగో రోజు పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది..

నంద్యాల: పాలిసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలోని సహాయ కేంద్రంలో నాలుగో రోజు గురువారం 43 వేల నుంచి 59 వేల ర్యాంక్‌ సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ వర్తించే విద్యార్థుల అర్హత పత్రాలను బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమాధికారులు పరిశీలించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన జూన్‌ 3వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రత్యేక కేటగిరీ, రిజర్వేషన్‌, ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్‌, స్పోర్ట్స్‌, గేమ్స్‌, పీడబ్ల్యూడీ విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో పరిశీలిస్తున్నారు.

TS Inter Supplementary Exams Paper Valuation postponed 2024 : ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ వాల్యుయోషన్ వాయిదా.. కార‌ణం ఇదే..?

#Tags