Tips for Best Score: నాలుగు మార్గాలతో మెరుగైన స్కోర్‌..!

అభ్యర్థులు కింద వివరించిన నాలుగు మార్గాలను అనుసరించి ముందుకు సాగితే, బెస్ట్‌ స్కోర్‌ వారిదే. ఆ నాలుగు మార్గాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్‌:

లాంగ్వేజ్‌ టెస్ట్‌
అభ్యర్థులు రెండు లాంగ్వేజ్‌లకు హాజరుకావాల్సి ఉంటుంది. కాబట్టి హాజరు కావాల్సిన లాంగ్వేజ్‌ టెస్ట్‌లలో మెరుగైన స్కోర్‌కు అభ్యర్థులు తాము ఎంచుకున్న లాంగ్వేజ్‌లకు సంబంధించి గ్రామర్, కాంప్రహెన్షన్, వాక్య నిర్మాణం, సాహిత్యం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ప్రెసిస్‌ రైటింగ్, ప్యాసేజ్‌ రీడింగ్‌ ప్రిపరేషన్‌తోపాటు ప్రశ్నలను సాధన చేయాలి.

డొమైన్‌ స్పెసిఫిక్‌ సబ్జెక్ట్‌
సంబంధిత సబ్జెక్ట్‌ల కోసం ఎన్‌సీఈఆర్‌టీ 12వ తరగతి పుస్తకాలను అధ్యయనం చేయాలి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ స్థాయి అకడమిక్‌ పుస్తకాలపై పట్టు సాధించాలి. అభ్యర్థులు తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌లలోని ముఖ్యమైన ఫార్ములాలు, అప్లికేషన్స్, సిద్ధాంతాలు, నిర్వచనాలు, భావనలపై దృష్టి పెట్టా­లి. ముఖ్యంగా బీఎస్సీ బీఈడీ అభ్యర్థులు సైన్స్, మ్యాథ్స్‌లలోని ముఖ్యమైన కాన్సెప్ట్‌లను నేర్చుకోవాలి.

NCET 2024 Notification: ఎన్‌సీఈటీ–2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఇంటర్మీడియట్‌తోనే బీఈడీలో ప్రవేశానికి అవకాశం..!

జనరల్‌ టెస్ట్‌
హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్‌ సైన్స్, ఎకనామిక్స్‌ పుస్తకాలను చదవాలి. కరెంట్‌ ఈవెంట్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా క్వాంటిటేటివ్‌ రీజనింగ్, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్‌ అంశాల్లో రాణించడానికి అర్థ గణిత అంశాలు, కోడింగ్‌ –డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, టైమ్‌ అండ్‌ వర్క్, నంబర్‌ సిస్టమ్స్‌పై అవగాహన పొందాలి.
 
టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌
విద్యా దృక్పథాలు, పెడగాజీ, చైల్డ్‌ డెవలప్‌మెంట్, శిశు వికాసం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. పెడగాజికి సంబంధించి సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం–నాయకత్వం– గైడెన్స్‌– కౌన్సెలింగ్‌ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. పెడగాజిలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తే.. ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. అదే విధంగా నూతన విద్యా విధానం–ఉద్దేశాలపై అవగాహన పెంచుకోవాలి. 

APRCET Exam 2024 : ఏపీ ఆర్‌సెట్‌-2024 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

#Tags