PhD Entrance Exam Ranker : పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో ప్రథమ ర్యాంకు..

కోటవురట్ల: పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఆ గ్రామానికే కాకుండా మండలానికి కీర్తిని తీసుకొచ్చాడు. రాష్ట్రవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలలో 2023–24 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో సుంకపూరు గ్రామానికి చెందిన పోలిరెడ్డి శ్యామ్‌కుమార్‌ ప్రతిభ చూపాడు. జాగ్రఫీ విభాగంలో ప్రథమ ర్యాంకు సాధించి పీహెచ్‌డీ చేసేందుకు అర్హత సాధించాడు. శ్యామ్‌కుమార్‌ మాట్లాడుతూ విపత్తుల నిర్వహణపై పరిశోధన చేస్తానని తెలిపాడు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు, గ్రామస్తులు అతనికి అభినందనలు తెలిపారు.

TS Government Jobs Updates 2024 : నిరుద్యోగులు ఆందోళన పడొద్దు.. జాబ్‌ కేలండర్ ఇస్తాం.. అలాగే మ‌రో 6000 టీచ‌ర్ పోస్టుల‌కు కూడా నోటిఫికేష‌న్‌ ఇస్తాం ఇలా..

#Tags