Engineering Admissions 2024: ఇంజినీరింగ్‌ అడ్మిషన్లు ప్రారంభం

తిరుపతి సిటీ: ఎస్వీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో గురువారం నుంచి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఏపీ ఈఏఎంసెట్‌–2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 16తో పూర్తికావడంతో ఆన్‌లైన్‌లో బుధవారం మొదటి దశ సీట్లు కేటాయించారు. దీంతో విద్యార్థులు తమకు నిర్దేశించిన కళాశాలలో అడిష్మన్లు పొందుతున్నారు.

మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 22వరకు కొనసాగనుంది. తిరుపతి ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో అన్ని బ్రాంచ్‌లకు కలిపి తొలి రోజు 150మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.

TS EAPCET 2024 Counselling:ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ ..... 75 శాతం సీఎస్‌ఈ ఆప్షన్లే

వర్సిటీలోని కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అడ్మిషన్స్‌ కమిటీ ఫర్‌ ఇంజినీరింగ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. ప్రొఫెసర్లు దివాకర్‌, గౌరీమనోహర్‌, అఖిల స్వతంత్ర పర్యవేక్షణలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.
 

#Tags