AP NIT Second Phase : ఏపీ నిట్‌లో రెండో ద‌శ ప‌నుల‌కు నిధులు.. త్వర‌లో జారీ కానున్న ఉత్త‌ర్వులు..

తాడేపల్లిగూడెంలో ఉన్న ఏపీ నిట్‌లో రెందో దశ పనుల కోసం నిధులు త్వరలో రానున్నాయి.

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో ఉన్న ఏపీ నిట్‌లో రెందో దశ పనుల కోసం నిధులు త్వరలో రానున్నాయి. మూడేళ్ల క్రితం నిట్‌ రెండో దశ పనుల కోసం రూ.735 కోట్లు కావాలని కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉన్నత విద్యా శాఖకు అప్పట్లో ప్రతిపాదనలు వెళ్లాయి. ఆర్థిక శాఖ అనుమతితో పాటు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేలోపు ఏపీ నిట్‌లో అనూహ్య పరిణామాలు, శాశ్వత డైరెక్టర్‌ లేకపోవడం వంటి కారణాలతో ఈ నిధులు రావడానికి మార్గం సుగమం కాలేదు.

AP NIT B Tech Admissions : ఏపీ నిట్‌లో బీటెక్ ప్ర‌వేశాల‌కు సంద‌డి.. స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు మాత్రం..

ఏపీ నిట్‌ విస్తరించడం, ఫలితాలు, ఉద్యోగావకాశాలు మెండుగా వస్తున్న నేపథ్యంలో రెండో దశ పనుల కోసం ఏపీ నిట్‌ నుంచి వెళ్లిన ప్రతిపాదనల ఆవశ్యకతను గుర్తించి కేంద్ర ఉన్నత విద్యా శాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, నిధులను రెండు విడతల్లో మొదట రూ.428 కోట్లు, మూడో దశ పనుల కింద సుమారు రూ.325 కోట్లు ఇవ్వడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. త్వరలో నిధుల విడుదలకు సంబంధించిన ఉత్వర్వులు రానున్నాయి.

JNTUK MBA and MCA Courses : జేఎన్‌టీయూకేలో స్పాన్స‌ర్డ్ విభాగంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

రెండోదశలో చేపట్టే పనులు ఇవే

రెండోదశ నిధుల కింద రానున్న రూ.428 కోట్లతో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలను నిర్మించనున్నారు. భవనాల నిర్మాణం కోసం రూ.314 కోట్లు, పరిశోధనాశాలల పరికరాలు, ఫర్నీచర్‌ కొనుగోలు నిమిత్తం రూ.114 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే సింగిల్‌ సీటర్‌, బాలురు, బాలికల వసతి గృహాల భవనాలు, పీహెచ్‌డీ చేస్తున్న మ్యారీడ్‌ స్కాలర్‌కోసం హాస్టల్‌ భవనం, ఇంటర్నేషనల్‌ విద్యార్ధులకు హాస్టల్‌, అకడమిక్‌ , డిపార్టుమెంటు ఆఫీస్‌ క్యాంపెయిన్‌ భవనం, ట్రెయినింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంటు టవర్‌ నిర్మాణం, సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌, సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్సీ, ఫెసిలిటీ, ఇన్నోవేషన్‌, ఇంక్యుబేషన్‌ సెంటర్‌ భవనాలు నిర్మించనున్నారు. అలాగే నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల కోసం టైప్‌ త్రీ క్వార్టర్లు, అధికారులు తదితరుల కోసం టైప్‌ 5 క్వార్టర్లు కలిపి రూ.428 కోట్లతో నిర్మిస్తారు. 24 నెలల వ్యవధిలో ఈ పనులు పూర్తి చేయాలి.

Grade B Officer Notification : గ్రేడ్‌–బి ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుద‌ల‌.. మూడు విభాగాల్లో మొత్తం 94 ఆఫీసర్‌ ఉద్యోగాలు

పది శాతం తిరిగి చెల్లిస్తే చాలు

కేంద్రం రెండోదశ పనుల కింద విడుదల చేసే నిధులు రూ.428 కోట్లలో కేవలం 10 శాతం ఏపీ నిట్‌ చెల్లిస్తే మిగిలిన 90 శాతం నిధులను కేంద్రమే చెల్లిస్తుంది. ఈ సొమ్మును 15 ఏళ్ల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిధులపై చెల్లించాల్సిన వడ్డీలో కేవలం ఐదుశాతం మాత్రమే నిట్‌ చెల్లించాలి. 95 శాతం కేంద్రం చెల్లిస్తుంది. ఈ నిధులు విడుదలై పనులు పూర్తయ్యితే మూడోదశ కింద రూ.325 కోట్లతో పనులు మంజూరు చేస్తారు.

AU Distance Education Admissions : ఆంధ్రా యూనివ‌ర్సిటీలో ఆన్‌లైన్‌ దూర‌విద్య యూజీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు..

#Tags