Dr. BR Ambedkar Open University: డా.బీఆర్‌ అంబేద్కర్‌ బీఎడ్‌ నోటిఫికేషన్‌ విడుదల

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఎడ్‌ (జనరల్‌), బీఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) అర్హత పరీక్ష 2024–25కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్‌లైన్‌లో ఈనెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి భోజు శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Dr. BR Ambedkar Open University

విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్‌ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంట్రన్స్‌ ఫీజు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.750 మాత్రమేనన్నారు. ఆన్‌లైన్‌లో డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా లేదా టీఎస్‌ ఆన్‌లైన్‌ ఫ్రాంఛైజీ కేంద్రాల్లో చెల్లించాలని తెలిపారు.

డిసెంబర్‌ 31న తెలంగాణలోని పరీక్షా కేంద్రాల్లో బీఎడ్‌ (జనరల్‌) ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, అదే రోజు బీఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారని శ్రీనివాస్‌ వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా తేదీకి రెండు రోజుల ముందు హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040–23680333/444/ 555లో లేదా విశ్వవిద్యాలయ వెబ్‌ పోర్టల్‌ని సందర్శించవచ్చని తెలిపారు.   

JEE Advanced 2025: మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌..

ముఖ్య సమాచారం
అంబేడ్కర్‌ వర్సిటీ బీఎడ్‌ నోటిఫికేషన్‌ విడుదల


దరఖాస్తు ఫీజు: రూ. 1000/-(ఎస్సీ/ఎస్టీ, వికలాంగులకు రూ.750)
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్‌ 21
పరీక్ష తేది: డిసెంబర్‌ 31న

Engineer Posts : బీఈఎల్‌ఓపీలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఇంజనీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు


పరీక్ష సమయం: ఉదయం 9-11 గంటల వరకు
               మధ్యాహ్నం 2-4 గంటల వరకు

మరిన్ని వివరాలకు: 040–23680333/444/ 555 సంప్రదించండి.               
 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags