PUC Results: ద్వితియ పీయూ పరీక్ష ఫలితాల్లో జిల్లా స్థానం ఇది..

ఇటీవలె జరిగిన పీయూసీ పరీక్షల్లో విద్యార్థులు గొప్ప మార్కులను సాధించారు. అయితే, ఈ మార్కుల అనుసారం జిల్లాకు స్థానం ప్రకటించారు..

కోలారు: ద్వితీయ పీయూ పరీక్ష ఫలితాల్లో ఈసారి జిల్లా 12వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 13,360 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 11,505 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

86.12 శాతం ఉత్తీర్ణత లభించింది. విజ్ఞాన శాస్త్ర విభాగంలో నగరంలోని మహిళా సమాజ కళాశాల విద్యార్థిని వందన (592 మార్కులు), వాణిజ్య శాస్త్రంలో బంగారుపేటె ఎస్‌డీసీ కళాశాలకు చెందిన నికేతన (594 మార్కులు), ఆర్ట్స్‌లో కోలారు బాలికల కళాశాలకు చెందిన జీఎం అర్చన (581 మార్కులు) జిల్లా టాపర్లుగా నిలిచారు.

AP TET 2024: బీఈడీ అభ్యర్థుల అకౌంట్‌కు ‘టెట్‌’ ఫీజు

గతేడాది ఫలితాల్లో జిల్లా 14 స్థానంలో ఉండగా, ఈ సారి మెరుగు పర్చుకుని 12వ స్థానానికి చేరుకుంది. ఫలితాల శాతం కూడా 6 శాతం వరకు పెరిగింది. వాణిజ్య విభాగంలో జిల్లా టాపర్‌ అయిన నికేతన రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించింది.

 

#Tags