Teaching Students : టీచ్ టూల్ ట్రైనింగ్‌లో ఉపాధ్యాయుల‌కు సూచ‌న‌లు.. విద్యార్థుల‌కు బోధ‌న ఈవిధంగా!

పుత్తూరు: క్షేత్ర స్థాయిలో విద్యా బోధనల్లో మార్పు స్పష్టంగా కనిపించాలని తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి శేఖర్‌ ఆదేశించారు. శుక్రవారం స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న క్లాస్‌ రూమ్‌ అబ్జర్వేషన్‌ టీచ్‌ టూల్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. డీఈఓ మాట్లాడుతూ శిక్షణా తరగతుల్లో గ్రహించిన, ఆకళింపు చేసుకున్న విషయాలతో బోధనా సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు.

Computer Science Course : కంప్యూట‌ర్ సైన్స్‌కే తొలి ప్రాధాన్య‌త‌.. మొద‌టి విడ‌త కౌన్సెలింగ్‌లోనే..!

తద్వారా విద్యార్థుల సామర్థ్యాలను మెరుగు పరిచేలా పాఠాలు బోధించాలన్నారు. 9 రోజుల శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పుత్తూరు డీవైఈఓ ప్రభాకర్‌రాజు, ఎంఈఓలు తిరుమలరాజు, బాలసుబ్రమణ్యం, శిక్షకులు రమేష్‌, బాలసుబ్రమణ్యం, హిమగిరి, వేణుగోపాల్‌, పుత్తూరు, నాగలాపురం, నారాయణవనం, పిచ్చాటూరు, సత్యవేడు, వడమాలపేట మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Supreme Court: నీట్‌–యూజీ సెంటర్ల వారీగా ఫలితాలు

#Tags