Degree Lecturer : డిగ్రీ కళాశాలలో అధ్యాపకునికి అరుదైన గౌర‌వం..

శ్రీకాళహస్తి: ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో అధ్యాపకునిగా విధులు నిర్వహించే సంక్రాంతి రాజేంద్రుడికి అరుదైన గౌరవం లభించింది. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో నేషనల్‌ ఎడ్యుకేషన్‌–2020 అనుసరించి అకడమిక్‌ ఇయర్‌ 2024–25 మూడో సెమిస్టర్‌కు సంబంధించి సింగ్‌ మేజర్‌ స్ట్రీమ్‌ ప్యాట్రన్‌లో భాగంగా రెండు కోర్సులను ప్రవేశ పెట్టారు.

NEET UG Revised Results: విడుదల చేయలేదు: కేంద్రం

ఇందుకు సంబంధించి ఏపీసీసీఈ వారు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి పట్టణంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగాధిపతి సంక్రాంతి రాజేంద్రుడు తిరుపతి జిల్లా తరఫున ఎంపికయ్యారు. ఈ అవకాశం రావడంతో ఆయన్ను కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీలత, అధ్యాపకులు వర్మ, బాపనయ్య, పరంధామయ్య తదితరులు అభినందించారు.

Students Talent Competitions : విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ ప్రతిభాన్వేషణ పోటీల‌కు ద‌ర‌ఖాస్తులు.. వీరే అర్హులు..!

#Tags