SVU Counselling : ఎస్వీయూ దూరవిద్యకు మహర్దశ.. ఏపీఈఏఎమ్‌సెట్‌లో అర్హుల‌కే దరఖాస్తు చేసుకునే అవకాశం!

ఎస్వీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో ఈ ఏడాది ఏపీఈఏఎమ్‌సెట్‌–2024 కౌన్సెలింగ్‌ వెబ్‌ ఆప్షన్ల నుంచి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను తొలగించారు.

తిరుపతి: ఎస్వీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో ఈ ఏడాది ఏపీఈఏఎమ్‌సెట్‌–2024 కౌన్సెలింగ్‌ వెబ్‌ ఆప్షన్ల నుంచి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను తొలగించారు. దీంతో ‘సెల్ఫ్‌కు చరమగీతం’ పేరుతో ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీంతో వర్సిటీ అధికారులు అప్రమత్తమై సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను కొనసాగించడంలో ఎదురయ్యే సమస్యలపై చర్చించారు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను తొలగించడం, డీడీఈ పునరుద్ధరణకు చేపట్టే చర్యలపై గురువారం వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్‌ భూపతి నాయుడు ‘సాక్షి’తో పలు అంశాలపై చర్చించారు. ఆయన మాటల్లోనే...

Job Mela: ఈనెల 31న జాబ్‌మేళా.. నెలకు రూ.16వేలకు పైగానే జీతం

ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు

ఎస్వీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌కు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2024 అకడమిక్‌ ఇయర్‌లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను పలు కారణాల చేత నిలిపివేశారు. కానీ, సుదీర్ఘంగా అధికారులు, కళాశాల ప్రిన్సిపల్‌, అధ్యాపకులతో ప్రత్యేకంగా సమావేశమై కోర్సులను కొనసాగించడంలో ఎదురయ్యే సమస్యలపై చర్చించాం. ప్రధానంగా మహిళలకు హాస్టల్‌ వసతి, బోధన సిబ్బంది, క్లాస్‌రూమ్‌ల కొరతతోనే కోర్సులను నిలిపి వేసినట్లు గుర్తించాం. తిరిగి ఎలాగైన సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను ఈ ఏడాది నుంచే కొనసాగించాలని నిర్ణయించాం.

Engineering Seats Increased 2024 : మ‌రో 9000 ఇంజినీరింగ్ సీట్లు.. రేప‌టి నుంచే వెబ్‌ ఆప్షన్లు..

డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది నుంచే ఈసీఈ, సీఎస్‌ఈ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌, వంటి పలు కోర్సులకు నోటిఫికేషన్‌ ఇస్తాం. ప్రత్యేక ప్రవేశ పరీక్షను నిర్వహించి మెరిట్‌ ప్రాతిపదికన అడ్మిషన్లు తీసుకుంటాం. అదేవిధంగా ఎపీఈఏఎమ్‌సెట్‌–24 లో మంచి ర్యాంకుతో అర్హత సాధించిన వారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తాం. త్వరలో విధివిధానాలు విడుదల చేస్తాం.

త్వరలో దూరవిద్యకు మహర్దశ

ఎస్వీయూ దూరవిద్యకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. సుమారు వర్సిటీకి రూ. 60కోట్లు ఆదాయం వచ్చే ఏకైక దూరవిద్యాకేంద్రం వర్సిటీలో ఉండడం అవసరం. లక్షల మంది విద్యార్థులు పలు కోర్సులను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఐఏఎస్‌లు. కేంద్ర సర్వీసులోని ఉన్నతాధికారులు దూరవిద్యాకేంద్రంలో పీజీలు చేశారు. అనివార్య కారణాలతో అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేక్‌ పడింది. డీడీఈకి త్వరలో మహర్దశ కల్పిస్తాం. దూరవిద్యాకేంద్రంలో ప్రస్తుతం ఉన్న కోర్సులను కొనసాగిస్తూ మరిన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలనే ఆలోచన ఉంది. త్వరలో వర్సిటీ అధికారులు ఢిల్లీకి బయలుదేరి డీడీఈ పునరుద్ధరణకు యూజీసీతో చర్చించనున్నాం. డీడీఈలో త్వరలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Degree Lecturer : డిగ్రీ కళాశాలలో అధ్యాపకునికి అరుదైన గౌర‌వం..

#Tags