Students and Teachers: ప్రతిభను కనబరిచిన విద్యార్థులు.. ప్రోత్సాహించిన ఉపాధ్యాయులు..!
పెద్దపల్లిరూరల్: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి లక్ష్యం సాధించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. పదో తరగతి వార్షిక ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, ప్రోత్సాహించిన ఉపాధ్యాయులను తన కార్యాలయంలో సోమవారం ఆయన సన్మానించారు. డీఈవో మాధవితో కలిసి విద్యార్థులకు పలు సూచనలిచ్చారు. జిల్లాలో ఈ సారి టెన్త్ ఫలితాలు మెరుగ్గానే వచ్చాయని తెలిపారు.
Jordan Armed Forces: భారత నావికా దళాన్ని సందర్శించిన శిక్షణా ప్రతినిధి బృందం
వచ్చే విద్యాసంవత్సరంలో నూరుశాతం ఫలితాలు సాధించేలా ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, ఇంటివద్ద చదువు ఫాలోఅప్ చేయడం లాంటి చర్యలు మంచి ఫలితాల సాధనకు దోహదపడ్డాయని అన్నారు. నూరు మార్కులు సాధించిన విద్యార్థులతో ముచ్చటించారు. జాతీయస్థాయి ప్రేరణ శిక్షణకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. అకడమిక్ అధికారి షేక్‌తోపాటు జిల్లా అధికారులు రంగారెడ్డి, మెహరాజ్ మహమూద్, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Free Training: నిరుద్యోగ యువతకు మూడు నెలలపాటు ఉచిత శిక్షణ!