Schools and Colleges Holidays : నెలాఖ‌రిలో సెల‌వులే సెల‌వులు.. ఇక విద్యార్థుల‌కు పండగే.. ఎన్నిరోజులంటే..!

విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు.. ఈ మాట వింటే ప్రతీ విద్యార్థికి పండగే. ఎగిరి గంతులేస్తారు.

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు.. ఈ మాట వింటే ప్రతీ విద్యార్థికి పండగే. ఎగిరి గంతులేస్తారు. ఇది కేవ‌లం విద్యార్థులే కాదు ఉద్యోగుల‌కు ప్ర‌క‌టించినా కూడా వారూ చిన్న‌పిల్ల‌ల్లాగా గంతులేస్తారు. ఇలా, ఒక‌టి రెండు రోజులు వీకెండ్ సెల‌వులు కాదు.. వ‌చ్చే వారంమంతా దాదాపు సెల‌వుల‌తోనే నిండిపోయేలా ఉంది. రెండో శ‌నివారం వ‌స్తేనే రెండు సెల‌వులు వ‌స్తున్నాయని సంబర ప‌డుతారు అంద‌రూ. అదే, స‌గానికి పైగా వారమంతా సెలవులే అంటే ఎంక ఎలా ఉంటారో అర్థం చేసుకోగ‌లం క‌దా..

Education News: ప్రభుత్వ విద్యా వ్యవస్థతో ఆటలు ....డిసెంబర్‌లో ట్యాబ్‌లు అందక విద్యార్థులు డీలా

నేటి నుంచి..

హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు శని, ఆదివారం రెండ్రోజులు సాధారణ సెలవు వుంటుంది. ఇలాంటి స్కూళ్ళలో విద్యార్థులకు నేడు శనివారం (డిసెంబర్ 21) నుండి సెలవులు ప్రారంభం అవుతున్నాయి. వెంట‌నే, క్రిస్మస్ పండక్కి మూడురోజులు, ఆ తర్వాత మ‌రో వారాంతంలో రెండు... ఇలా మొత్తం ఏడురోజుల సెలవులు వస్తున్నాయి. అనంత‌రం, ఈ సంవ‌త్స‌రం ముగుస్తుంది. ఆ తర్వాత జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ సందర్భంగా మరో సెలవు వస్తుంది.

Andhra Pradesh Breaking News: విశాఖ జిల్లాలో వదలని వర్షం ఇవాళ స్కూళ్లకు సెలవు....

ఈ తేదీల్లోనే..

డిసెంబర్ 21,22 (శని, ఆదివారం) కావడంతో స్కూల్స్‌కు సెల‌వు ఉంటుంది. ఇది వేవ‌లం శ‌ని ఆదివారాలు సాధార‌ణ సెలవును ప్ర‌క‌టించే స్కూళ్ల‌కు మాత్ర‌మే. సోమవారం ఒక్కరోజు స్కూల్ కి వెళితే చాలు, తిరిగి,  మంగళవారం నుండి క్రిస్మస్ సెలవులు ప్రారంభం. అంటే, డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే. మ‌రుస‌టి రోజు డిసెంబర్ 25న క్రిస్మస్ పండగ సందర్భంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు. ఆ తర్వాతిరోజు డిసెంబర్ 26న బాక్సిండ్ డే కావడంతో మరోసారి సెలవు. ఇలా వారం మధ్యలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.

CBSE Schools Breaking News: సీబీఎస్‌ఈ ఆకస్మిక తనిఖీల్లో దొరికిన డమ్మీ విద్యార్థులు!
 
క్రిస్మ‌స్ సెల‌వులు అయిపోగానే, డిసెంబర్ 27 శుక్రవారం కావ‌డంతో విద్యాసంస్థలు తెరుచుకుంటాయి. ఆ తర్వాతి రోజు అంటే డిసెంబర్ 28 శనివారం, డిసెంబర్ 29 ఆదివారం ఈ రెండురోజులు సాధార‌ణ సెల‌వు కావ‌డంతో మ‌రో రెండు సెల‌వులు. మొత్తంగా చూసుకుంటే, శని, ఆదివారం సాధారణ సెలవులుండే విద్యాసంస్థలు వచ్చే వారం కేవలం రెండురోజులు (సోమవారం, శుక్రవారం) మాత్రమే తెరుచుకోనున్నాయి.

ఈ విద్యాసంస్థ‌ల‌కు మాత్రం..

ఇక రెండు తెలుగు రాష్ట్రాలు.. అంటే, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ, అత్యధిక ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆదివారం మాత్రమే సాధారణ సెలవు. అక్క‌డ కోన్ని పాఠ‌శాలలకు ప్రతీ శ‌నివారం సెల‌వు ఉండ‌దు. కేవ‌లం, రెండో శ‌నివారం మాత్ర‌మే సాధార‌ణ సెల‌వు ఉంటుంది. ఇటువంటి, స్కూళ్ళు, కాలేజీల్లో ఆదివారం అంటే, డిసెంబర్ 22 నుండి సెలవులు ప్రారంభంకానున్నాయి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

అనంత‌రం, డిసెంబర్ 24, 25, 26 (మంగళ, బుధ, గురు) మూడురోజులు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. తిరిగి, డిసెంబర్ 29వ తేదీన‌ ఆదివారం సాధారణ సెలవులు. మొత్తంగా వచ్చేవారం ఐదురోజుల సెలవులు వస్తున్నాయి. అంటే శ‌నివారం సాధార‌ణ సెల‌వు కాని విద్యాసంస్థ‌ల‌కు   స్కూళ్లు, కాలేజీలు నడిచేది డిసెంబర్ 23 (సోమవారం), డిసెంబర్ 27, 28 (శుక్ర, శనివారం) మూడురోజులు మాత్రమే.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags