National Science Day : దేశ వ్యాప్తంగా సైన్స్‌ దినోత్సవాలను ఘనంగా ప్రారంభం..

సూళ్లూరుపేట: జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఆగస్టు 23 దాకా దేశ వ్యాప్తంగా సైన్స్‌ దినోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఇస్రో చంద్రయాన్‌–3 ప్రయోగంలో ల్యాండర్‌, రోవర్‌ను విజయవంతంగా ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై దించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆ రోజును జాతీయ సైన్స్‌డే ప్రకటించిన విషయం తెలిసిందే.

Importance to Education : విద్యారంగంలో అధిక ప్రాధాన్య‌త ఇవ్వాలి.. నిధుల‌తో అభివృద్ధి ఇలా..!

జాతీయ సైన్స్‌డే మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌, సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఒడిశాలోని భువనేశ్వర్‌లో మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. రాకెట్‌ సైన్స్‌ గురించి కూడా నేటి తరం విద్యార్థులకు తెలియజేసేందుకు సెమినార్లు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 23న సతీష్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌లో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని షార్‌ డైరెక్టర్‌ రాజరాజన్‌ తెలిపారు.

Budget Issues : బ‌డ్జెట్‌పై ఉద్యోగ‌, ఉపాధ్యాయుల తీవ్ర నిరాశ‌..

#Tags