Bhatti Vikramarka: 6000 టీచర్‌ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: మరో ఆరు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ వేయబోతున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని గురువారం రవీంద్రభారతిలో గురుపూజ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 

పదిరోజుల్లో డీఎస్సీ ఫలితాలు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి మాట్లాడుతూ,ప్రగతిశీల సమాజ నిర్మాణంలో టీచర్లది కీలకపాత్ర అని కొనియాడారు.  ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. విద్యారంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. 11,062 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలను మరో పదిరోజుల్లో వెల్లడించనున్నట్టు తెలిపారు. 

Tomorrow Schools Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. కలెక్టర్‌ ఆదేశాలు

పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌

ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు విదేశీ విద్య, ఉన్నత విద్యకు సంబంధించి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మారుతున్న కాలంతో పాటు ఉపాధ్యాయులూ ఆప్‌గ్రేడ్‌ కావాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి సూచించారు. 

Jobs In SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్య కమిషనర్‌ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్‌ నర్సింహారెడ్డి, ఇంటర్‌బోర్డ్‌ కార్యదర్శి శృతి ఓజా, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌కే మహమూద్, ప్రొఫెసర్‌ వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఎమ్మెల్సీలు కూర రఘోత్తమ్‌రెడ్డి, ఎ.నర్సిరెడ్డి, ఎ.వెంకటనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందించిన 150 మంది అధ్యాపకులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ సత్కరించారు.  

#Tags