KU Law College : కేయూ 'లా' కళాశాలకు బీసీఐ అనుమతి.. మూడేళ్ల, ఐదేళ్ల కోర్సులో ప్రవేశాలు..

హనుమకొండ సుబేదారిలోని కాకతీయ యూనివర్సిటీ 'లా' కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) అనుమతినిచ్చింది.

కేయూ క్యాంపస్: హనుమకొండ సుబేదారిలోని కాకతీయ యూనివర్సిటీ 'లా' కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) అనుమతినిచ్చింది.

ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన ఉత్తర్వులు తమకు అందాయని కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి, యూనివర్సిటీ 'లా' కాలేజీ ప్రిన్సిపాల్ సుదర్శన్ గురువారం తెలిపారు. ఇటీవల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతినిస్తూ విడుదల చేసిన 'లా' కళాశాలల జాబితాలో కాకతీయ యూనివర్సిటీ 'లా' కాలేజ్ లేని విషయం విధితమే. ప్రధానంగా రెగ్యులర్ అధ్యాపకులు సరిపడా లేరనే కారణాలతో కేయూ 'లా' కాలేజీకి బీసీఐ అనుమతి నిరాకరించిన విషయం విధితమే.

Quiz Competitions : డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ క్విజ్ పోటీలు..

దీంతో కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి యూనివర్సిటీ 'లా' కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి కోసం ప్రయత్నాలు చేశారు. చివరికి ఈనెల 28న అనుమతి ఇస్తున్నట్లు బీసీఐ నుంచి ఉత్తర్వులు గురువారం యూనివర్సిటీ రిజిస్ట్రార్, 'లా' కాలేజి ప్రిన్సిపాల్ అందాయి. 2024-2025 విద్యాసంవత్సరంలో మూడేళ్ల లా కోర్సుకు (60సీట్లు) ఐదేళ్ల లా కోర్సు (60సీట్లు) భర్తీకి అప్లియేషన్ అనుమతినిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Solar Power Plant: తెలంగాణ పొలాల్లో సోలార్‌ ప్లాంట్లు.. పీఎం–కుసుం పథకం కింద కేంద్రం గ్రీన్‌సిగ్నల్

దీంతో లా సెట్ కన్వీనర్ రమేశ్వాబు కాకతీయ యూనివర్సిటీ 'లా' కాలేజీ పేరును సంబంధిత వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచి వెబ్ ఆప్షన్లకు కల్పించారు. అయితే, రాష్ట్రంలో 'లా' కళాశాలల్లో ప్రవేశాలకు గాను ఇప్పటికే మొదటి దశ ప్రవేశాలకు తొలుత ఈనెల 27, 28 తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. లాసెట్ ప్రవేశాలకు ఈవెబ్సైట్లో కేయూ 'లా' కాలేజీ గురువారం చేర్చినందున ఈనెల 30వరకు వెబ్ ఆప్షన్లకు గడువు ఇచ్చారు.

Job Mela: రేపే జాబ్‌మేళా.. నెలకు రూ. 25వేల వరకు జీతం

#Tags