Textile Technology Course: డిప్లామా ఇన్‌ హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ కోర్సులకు దరఖాస్తులు.. అర్హులు వీరే!

టెక్నాలజీలో డిప్లామా ఇన్‌ హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు జిల్లా చేనేతజౌళి శాఖ అధికారి రమేష్‌బాబు. పూర్తి వివరాలను పరిశీలించండి..

పుట్టపర్తి టౌన్‌: వెంకటగిరిలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్స్‌ టెక్నాలజీలో డిప్లామా ఇన్‌ హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ కోర్సులో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా చేనేతజౌళి శాఖ అధికారి రమేష్‌బాబు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై 23 ఏళ్ల వయసు కలిగిన విద్యార్థినీ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.

NEET Entrance Exam: ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు నేడే నీట్‌ పరీక్ష.. ఈసారి విద్యార్థుల సంఖ్య..!

మెదటి సంవత్సరం రూ.1,000, రెండో సంవత్సరం రూ.1,100, మూడో సంవత్సరం రూ.1,200 చొప్పున స్కాలర్‌షిప్‌ ఉంటుందని తెలిపారు. వెంటకగిరిలో ఆంధ్ర, తెలంగాణ రాష్టాలకు కలసి మొత్తం 53 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. జూన్‌ ఒకటో తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 08625–295003, 93999 37872, 90102 43054 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Nakshatra Sabha: ఉత్తరాఖండ్‌లో నక్షత్ర సభ.. ఈ సభలో ఏముందంటే..

#Tags