Govt Hostels Admissions : వికలాంగులకు ప్రభుత్వ వసతి గ్రుహాల్లో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు..

ప్రభుత్వ శారీరక వికలాంగుల వసతి గృహంలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని వివ‌రించారు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా..

కర్నూలు: నగరంలోని సీ క్యాంప్‌లో ఉన్న ప్రభుత్వ శారీరక వికలాంగుల వసతి గృహంలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ఫాతిమా కోరారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు వసతి కల్పించడం జరుగుతుందన్నారు.

School Inspection : గిరిజ‌న ఆశ్ర‌మ పాఠ‌శాల తనిఖీ..

శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు చదువుతున్న శారీరక వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన శారీరక వికలాంగులైన విద్యార్థులు తమ దరఖాస్తులను వసతి గృహ సంరక్షకునికి అందజేయాలన్నా రు. మరిన్ని వివరాలకు సెల్‌: 8639152178, కార్యాలయ ఫోన్‌: 08518–277864 నంబర్లను సంప్రదించాలన్నారు.

NEET Row 2024: పేపర్‌ లీక్‌ అయినా నీట్‌ పరీక్ష రద్దు చేయరా? కారణమేంటి?

#Tags