AP students in Columbia University: అంతర్జాతీయ వేదికలో ప్రసంగించిన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు

అంతర్జాతీయ వేదిక కొలంబియా యూనివర్సిటిలో ప్రసంగించిన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు.

*అంతర్జాతీయ వేదిక కొలంబియా యూనివర్సిటిలో ప్రసంగించిన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు*

 

ఆంధ్రప్రదేశ్ లో సిఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న నాడు నేడు విద్యా సంస్కరణలపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రసంగం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అగ్రరాజ్యమైన అమెరికాకు వెళ్లి ప్రసంగం చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అంతర్జాతీయ పర్యటనలో పాల్గొనడం చరిత్రలో ఇదే మొదటి సారి.

ఏపీ విద్యావిధానాన్ని కొలంబియా యూనివర్సిటి ఎడ్యుకేషన్ డైరెక్టర్ రాధికా అయ్యాంగార్ కొనియాడారు. ఏపీ విద్యావిధానంలో విద్యార్ధులకు ఇంగ్లీష్ మాధ్యమం బాగుందన్నారు UN గ్లోబల్ స్కూల్స్ ఆఫీసర్ అమాండా.

ప్రభుత్వ పాఠశాల విద్యార్ధుల కోసం టోఫెల్ పెట్టడం చాలా గ్రేట్ అని కెనడా యూనివర్సిటి ఆఫ్ వాటర్ లూ డీన్ ఆఫస్ మేనేజర్ బ్రాక్ డికిన్ సన్ కొనియాడారు.

యునైటెడ్ నేషన్స్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ నేతృత్వంలో అమెరికాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం పర్యటిస్తున్నారు. ప్రపంచ స్ధాయి విద్యావేత్తలు, ప్రొఫెసర్ల ముందు ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణల గురించి అంతర్జాతీయ వేదికిపై మాట్లాడారు మన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు.

#Tags