AP Holidays 2024 List : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది సాధారణ సెలవులు ఇవే.. స్కూల్స్‌, కాలేజీల‌కు మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఏడాది భారీగా సెల‌వులు రానున్నాయి. ఈ మేరకు ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. వ‌చ్చే ఏడాది 2024లో స్కూల్స్‌, కాలేజీల‌కు ఎక్కువగానే సాధారణ సెల‌వులు రానున్నాయి.

పండుగలు, జాతీయ సెలవులను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 20 రోజులను సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది. ఈమేరకు నోటిఫికేషన్‌లో పేర్కొంది. జనవరి 15, 16వ తేదీల్లో సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. భోగి, అంబేడ్కర్‌ జయంతి ఆదివారం, దుర్గాష్టమి రెండో శనివారం వచ్చాయని తెలిపింది. ఏప్రిల్‌ 9న ఉగాది సెలవుగా ప్రకటించింది.

➤ School Holidays List December 2023 : స్కూల్స్‌కు 9 రోజులు సెల‌వులు.. బ్యాంకులకు 14 రోజులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఈ సారి సంక్రాంతి, ద‌స‌రా, క్రిస్టమస్ పండ‌గ‌కు స్కూల్స్‌, కాలేజీల‌కు ఎక్కువ రోజులు రానున్నాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి, అక్టోబ‌ర్ నెల‌లో ఎక్కువ రోజులు సెల‌వులు వ‌చ్చాయి. అలాగే భారీ వాన‌లు, బంద్‌ల వ‌ల్ల స్కూల్స్‌, కాలేజీల‌కు అనుకోని సెల‌వులు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే..
☛ 15-01-2024న (సోమవారం) సంక్రాంతి
☛ 16-01-2024న (మంగళవారం) కనుమ
☛ 26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
☛ 08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

AP Holidays 2024 Details List : 

☛ Telangana School and Colleges 2024 Holidays List : వ‌చ్చే ఏడాది 2024లో స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీస్‌ల‌కు సెల‌వులు ఇవే.. ఎక్కువ హాలిడేస్‌ ఈ నెల‌లోనే..

#Tags