Anganwadi Schools: సరికొత్తగా ‘అంగన్‌ బడి’.. పిల్లల పెంపునకు ప్రత్యేక డ్రైవ్‌

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): పిల్లలకు తొలి ఒడి అమ్మ అయితే.. మలిఒడి అంగన్‌వాడీ కేంద్రాలే కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పూర్వ ప్రాథమిక విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ‘అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట’ను ప్రారంభించనుంది. సోమవారం నుంచి ఈనెల 20వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఐసీడీఎస్‌ సిబ్బంది సిద్ధమయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించి అంగన్వాడీ టీచర్లకు విడతల వారిగా శిక్షణ ఇచ్చారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా చిన్నారులకు అక్షరాలు, అంకెలు, ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తారు. ఇందుకు సంబంధించిన సామగ్రిని సిబ్బందికి అందుబాటులో ఉంచారు.

కార్యాచరణ ఇలా...

● ఈ నెల 15, 16వ తేదీల్లో అంగన్వాడీ టీచర్లు, సహాయకులు, బాలికలు, డ్వాక్రా సంఘం ప్రతినిధులు, పాఠశాలల ఉపాధ్యాయులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, తల్లిదండ్రుల సహకారంతో ర్యాలీలు నిర్వహిస్తారు. అలాగే అంగన్‌ వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతారు. పాఠశాల, కళాశాల విద్యకు దూరంగా ఉన్న బాలికలను గుర్తిస్తారు.

Good News For Bank Employees: ఇకపై వారానికి ఐదు రోజులే పని దినాలు!.. త్వరలోనే ఆమోదం

● 18న ఇంటింటికీ తిరిగి రెండున్నరేళ్ల వయసున్న చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడుతారు. బోధనా పద్ధతులు, చిన్నారుల వివరాలను నమోదు చేయడం, ఐదేళ్లు పూర్తైన వారికి అంగన్వాడీ నుంచి ప్రీ స్కూల్‌ సర్టిఫికెట్‌ అందజేస్తారు.

● 19న అంగన్వాడీ కేంద్రాల్లో స్వచ్ఛత పాటిస్తారు. మొక్కలు నాటడం, కిచెన్‌ గార్డెన్ల ఏర్పాటు, తాగునీరు, మరుగుదొడ్డి సదుపాయాలు కల్పించడం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు.

Anganwadi Schools: ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా అంగన్‌వాడీలు.. కాన్వెంట్‌ స్కూళ్లకు ధీటుగా

● 20న ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ డెవలప్‌మెంట్‌ డే, సామూహిక అక్షరాభ్యాసం చేయిస్తారు. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు, తాత, నానమ్మ, అమ్మమ్మలను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించి అవగాహన కల్పిస్తారు. బోధన, ఆట వస్తువులను ప్రదర్శించి, పిల్లల తల్లిదండ్రులను సన్మానిస్తారు.

అందరూ సహకరించాలి

ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో రోజువారీగా కార్యక్రమాలు నిర్వహిస్తాం. దీనికి సంబంధించి టీచర్లకు శిక్షణ తరగతులను నిర్వహించాం. కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
– లలిత కుమారి,జిల్లా ఐసీడీఎస్‌ అధికారి
 

#Tags