Anganwadi Centers : అంగన్‌వాడీ కేంద్రాల‌కు కలెక్టర్ కీల‌క ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా

అంగన్‌వాడీ చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అత్యంత నాణ్యతతో అందించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన అధికారుల‌కు సూచించారు..

గాంధీనగర్‌: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో లక్ష్యాలకు అనుగుణంగా సాగాలని, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అత్యంత నాణ్యతతో అందించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాలపై గురువారం ఆమె సమీక్షించారు. వివిధ కార్యక్రమాలు, పథకాలు, సంస్థల ద్వారా స్త్రీ, శిశు సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు.

Civils Free Coaching: సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

సప్లిమెంటరీ న్యూట్రిషన్‌ ప్రోగ్రామ్‌, టీకాలు, ఆరోగ్య పరీక్షలు, పోషణ, ఆరోగ్య విద్య, పూర్వ ప్రాథమిక విద్య తదితరాలకు సంబంధించిన వివరాలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య భవిష్యత్తు అభ్యసనానికి గట్టి పునాది వేస్తుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్వ ప్రాథమిక విద్య సరైన విధంగా అందేలా చూడాలన్నారు.

Free Training: ఉచిత సాంకేతిక శిక్షణకు రేపు ఎంపిక

మెనూ ప్రకారం పోషకాహారాన్ని అందించాలన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం పటిష్టంగా అమల్లో భాగంగా కార్యాలయాల్లో ఇంటర్నల్‌ కంప్లయింట్‌ కమిటీ (ఐసీసీ)ల ఏర్పాటు తప్పనిసరిగా జరగాలని ఆదేశించారు. వన్‌ స్టాప్‌ సెంటర్‌, చిల్డ్రన్‌ హోమ్స్‌, స్పెషలైజ్డ్‌ అడాప్షన్‌ ఏజెన్సీ (ఎస్‌ఏఏ), మిషన్‌ శక్తి తదితరాలపైనా సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ జి. ఉమాదేవి, డీసీపీవో రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Awareness for Students : విద్య‌తోపాటు ఇత‌ర విష‌యాల్లో కూడా విద్యార్థుల్లో అవాగ‌హ‌న పెంచాలి..

#Tags